భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంక..!
విధాత: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ.. భారత్ జోడో యాత్రలో అక్టోబర్ 6వ తేదీన పాల్గొననున్నట్లు సమాచారం. ఆ మరుసటి రోజున సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ కూడా యాత్రలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.భారత్ జోడో యాత్ర ప్రారంభమైన సమయంలో.. సోనియా వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లిన సంగతి […]

విధాత: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ.. భారత్ జోడో యాత్రలో అక్టోబర్ 6వ తేదీన పాల్గొననున్నట్లు సమాచారం.
ఆ మరుసటి రోజున సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ కూడా యాత్రలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
భారత్ జోడో యాత్ర ప్రారంభమైన సమయంలో.. సోనియా వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. యాత్రలో పాల్గొనే కంటే రెండు రోజుల ముందే సోనియా కర్ణాటకకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్రలో ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హుషారుగా పాల్గొంటున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ యాత్ర విజయవంతమైంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో భారత్ జోడో యాత్ర 21 రోజుల పాటు 511 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.