TDP | సుహాసిని ఇక ఏపీకి రానట్టేనా.. తెలంగాణకే పరిమితమా

TDP విధాత‌: దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని, ఏకంగా గుడివాడలో పోటీ చేస్తారని , కోడలి నానికి గట్టి పోటీ ఇస్తారని ఆమధ్య పుకార్లు వచ్చాయి. ఆ తరువాత ఆమె ఇంకో నియోజకవర్గంలో దిగుతారని అన్నారు. నందమూరి ఫామిలీ నుంచి పోటీ చేస్తే దాని ప్రభావం ఓటర్లమీద బాగా ఉంటుందని, గెలుపు అవకాశాలు ఉంటాయని అప్పట్లో TDP భావించిందని అంటారు. అయితే ఇప్పుడు అదేం లేనట్లు కనిపిస్తోంది. ఆమె కేవలం తెలంగాణకు […]

TDP | సుహాసిని ఇక ఏపీకి రానట్టేనా.. తెలంగాణకే పరిమితమా

TDP

విధాత‌: దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని, ఏకంగా గుడివాడలో పోటీ చేస్తారని , కోడలి నానికి గట్టి పోటీ ఇస్తారని ఆమధ్య పుకార్లు వచ్చాయి. ఆ తరువాత ఆమె ఇంకో నియోజకవర్గంలో దిగుతారని అన్నారు. నందమూరి ఫామిలీ నుంచి పోటీ చేస్తే దాని ప్రభావం ఓటర్లమీద బాగా ఉంటుందని, గెలుపు అవకాశాలు ఉంటాయని అప్పట్లో TDP భావించిందని అంటారు.

అయితే ఇప్పుడు అదేం లేనట్లు కనిపిస్తోంది. ఆమె కేవలం తెలంగాణకు పరిమితమై రాజకీయాలు చేస్తారని అంటున్నారు. గతంలో ఆమె హైదరాబాద్‌ కూకట్పల్లి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయిన సుహాసిని ఆ తరువాత అక్కడక్కడా పొలిటికల్ మీటింగుల్లో కనిపిస్తున్నారు తప్ప పెద్దగా యాక్టివ్ కాలేదు. దానికి తోడు తెలంగాణాలో TDP ప్రభావం కూడా తక్కువే.

కాబట్టి ఏదో నామ్ కే వాస్తేగా ఆమె కనిపించడం తప్ప పెద్దగా చేయడానికి అక్కడ ఏమి లేదు. ఈ తరుణంలోనే ఆమె ఆంధ్రాలో పోటీ చేస్త్రని ఆ మధ్య పుకార్లు వచ్చాయి.. వీటిని నందమూరి అభిమానులు, TDP కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టినా అదేమీ వర్కవుట్ అయ్యేలా లేదు.

తెలంగాణ రాష్ట్ర TDP కార్యవర్గాన్ని ఈ మధ్య ప్రకటించిన చంద్రబాబు అక్కడ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించారు.. ఇదే రాష్ట్ర కమిటీలో సుహాసినిని ఉపాధ్యక్షురాలిగా నియమించారు. అంటే ఇక ఆమె పార్టీ, కార్యక్షేత్రం తెలంగాణ అని స్పష్టమైంది. అక్కడ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉంటూ ఆంధ్రాలో పోటీ చేయడం పధ్ధతి కాదు కాబట్టి ఆమె మరి ఆంధ్రాలో కనిపించరని అంటున్నారు.

మళ్ళీ ఆమె కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండే కూకట్ పల్లి నుంచి అయితే గెలవడం కాస్త సుళువన్న భావనతో ఆమెను అక్కడి నుంచే బరిలోకి దించుతారు అంటున్నారు. గతంలో అక్కడ ఓడిన సుహాసిని మళ్ళీ అక్కడ గెలుస్తారా.? చూడాలి మరి.