64 మంది సంతకాల లేఖతో రాజ్ భవన్‌ కు కాంగ్రెస్‌ బృందం

కాంగ్రెస్‌ పార్టీ శాసన సభ పక్ష నేతను కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కోరుతూ పార్టీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన లేఖను కాంగ్రెస్‌ బృందం గవర్నర్‌కు అందచేసింది.

64 మంది సంతకాల లేఖతో రాజ్ భవన్‌ కు కాంగ్రెస్‌ బృందం

విధాత: కాంగ్రెస్‌ పార్టీ శాసన సభ పక్ష నేతను కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కోరుతూ పార్టీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన లేఖను కాంగ్రెస్‌ బృందం గవర్నర్‌కు అందచేసింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ గౌడ్‌, అధికార ప్రతినిధి మల్లు రవిల బృందం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రేవంత్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్న లేఖను అందచేశారు. ఎల్బీ స్టేడియంలో రేపు రేవంత్‌ మంత్రివర్గం ప్రమాణాస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా వారి వెంట రాజ్‌భవన్‌కు వెళ్లారు.

అటు రేవంత్‌ సీఎంగా తన పదవి ప్రమాణాస్వీకారోత్సవానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలను, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌లను, ఇతర ఏఐసీసీ, సీడబ్ల్యుసీ నేతలను ఆహ్వానించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సహా ఆ రాష్ట్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ప్రమాణాస్వీకారానికి వస్తారని భావిస్తున్నారు