Land Disputes | ఆసిఫాబాద్: భగ్గుమన్న భూ తగాదాలు.. ముగ్గురు మృతి
Land Disputes | భూ తగాదాలో దాయాదుల మధ్య ఘర్షణ కర్రలు, కత్తులు, గొడ్డళ్ల తో పరస్పరం దాడి. విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని రెబ్బెన మండలం జక్కులపల్లిలో ఇరువర్గల మధ్య భూతగాదా (Land Disputes) నెలకొంది. జక్కులపల్లి గ్రామ శివారులో సర్వేనెంబర్ 109, 111 లలో భూమయ్యనే వ్యక్తి పేరు మీద 9 ఎకరాల భూమి కలదు. గత రెండు సంవత్సరాల నుండి తాతల ఆస్తుల […]

Land Disputes |
- భూ తగాదాలో దాయాదుల మధ్య ఘర్షణ కర్రలు, కత్తులు, గొడ్డళ్ల తో పరస్పరం దాడి.
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని రెబ్బెన మండలం జక్కులపల్లిలో ఇరువర్గల మధ్య భూతగాదా (Land Disputes) నెలకొంది. జక్కులపల్లి గ్రామ శివారులో సర్వేనెంబర్ 109, 111 లలో భూమయ్యనే వ్యక్తి పేరు మీద 9 ఎకరాల భూమి కలదు.
గత రెండు సంవత్సరాల నుండి తాతల ఆస్తుల కోసం ఇరువర్గల మధ్య భూ తగదా కొనసాగుతుంది. గత రెండు రోజుల నుండి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిన్న ఒక వర్గం పత్తి విత్తనాలు నాటారు. నేడు ప్రత్యర్థి వర్గం మధ్యాహ్నం అక్కడికి వెళ్లి ఆ భూమిలో తమకు వాటా ఉందని ఘర్షణ పడ్డారు.
పత్తి గింజలు పెట్టిన భూమిలోకి ప్రత్యర్థి వర్గం 6 మంది కర్రలు, కత్తులు గొడ్డళ్ల తో భూమి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వారితో గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య గొడవ కాస్త మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.
అయితే.. 6 మంది ఒకసారిగా విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఐదుగురు ప్రతి దాడి చేయడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. శంకర్, నర్సయ్య, మహిళా బక్కక్క ల మృతి చెందగా
మరో నలుగురికి తీవ్ర గాయాలైనవి.
తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పికెటింగ్ ఏర్పాటు చేశారు.