గుర్రంపొడులో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం బీభత్సం
విధాత: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కోప్పోలు, నడికుడ గ్రామాలలో ఈదురుగాలులతో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల దాటికి పలు ఇండ్లు దెబ్బతినగా, వడగళ్ల వర్షానికి కోతకు వచ్చిన వరి పొలాలు నేలకొరిగాయి. నడికుడలో, కొప్పోలు గ్రామాల్లో రెండు దుకాణాల పైకప్పులు గాలులకు ఎగిరిపోయాయి. రుద్రాక్ష లావణ్య అనే మహిళ ఇంటి పైకప్పు కూలి పడడంతో ఆమె చేయి విరిగింది. గోడలు కూలి ఒక దూడ మృతి చెందగా మరో రెండు దూడలకు కాళ్లు […]

విధాత: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కోప్పోలు, నడికుడ గ్రామాలలో ఈదురుగాలులతో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల దాటికి పలు ఇండ్లు దెబ్బతినగా, వడగళ్ల వర్షానికి కోతకు వచ్చిన వరి పొలాలు నేలకొరిగాయి.
నడికుడలో, కొప్పోలు గ్రామాల్లో రెండు దుకాణాల పైకప్పులు గాలులకు ఎగిరిపోయాయి. రుద్రాక్ష లావణ్య అనే మహిళ ఇంటి పైకప్పు కూలి పడడంతో ఆమె చేయి విరిగింది.
గోడలు కూలి ఒక దూడ మృతి చెందగా మరో రెండు దూడలకు కాళ్లు విరిగాయి. బాధిత రైతులు, ప్రజలు తమను ఆదుకోవాలని అధికారులకు మొరపెట్టుకున్నారు.