జైల్లో పెట్టుకుంటారా పెట్టుకోండి.. మోదీకి కవిత సవాల్
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఎమ్మెల్సీ కవిత తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో పెట్టుకుంటారా, పెట్టుకోండి అంటూ మోదీకి కవిత సవాల్ చేశారు. ఇక కాదు కూడదు.. అది జేస్తం.. ఇది జేస్తం.. జైల్లో పెడుతాం అంటే పెట్టుకో. […]

MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఎమ్మెల్సీ కవిత తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో పెట్టుకుంటారా, పెట్టుకోండి అంటూ మోదీకి కవిత సవాల్ చేశారు.
ఇక కాదు కూడదు.. అది జేస్తం.. ఇది జేస్తం.. జైల్లో పెడుతాం అంటే పెట్టుకో. ఏమైతది. భయపడేది ఏముంది. ఏం చేస్తరు. ఎక్కువల ఎక్కువ ఉరి ఎక్కిస్తారా? ఎక్కువల ఎక్కువ అంటే జైళ్ల పెడుతరు. పెట్టుకోరాదు.. ఏమైతది. ప్రజలు మన వెంట ఉన్నంతకాలం ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తున్నంత కాలం ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాదని తెలియజేస్తున్నాను. ఏజెన్సీలను స్వాగతిస్తున్నాం. మేం పూర్తిస్థాయి విచారణకు వారికి సహకరిస్తాం. మేం ఎవరికీ భయపడం అని కవిత తేల్చిచెప్పారు.
మోదీ కంటే ముందు ఈడీ రావడం సహజం
ఈ దేశంలో మోదీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అవుతుంది అని కవిత తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన పరిస్థితిని చూశాం. ఏదైనా రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయంటే.. ఒక సంవత్సరం ముందే మోదీ కంటే ముందు ఈడీ రావడం చూస్తున్నాం. ఇది కొత్త విషయం కాదు.. ఈ దేశ ప్రజలు ఈ విషయాలన్నింటిని గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలున్నాయి కాబట్టి మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందని కవిత పేర్కొన్నారు.
భయపడేది లేదు.. విచారణను ఎదుర్కొంటాం..
నా మీద కావొచ్చు.. మన ఎమ్మెల్యేలు, మంత్రుల మీద కావొచ్చు. ఈడీ, సీబీఐ కేసులు పెట్టడమన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన, నీచమైన ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అంత కంటే లేదు. ఎటువంటి విచారణను అయినా ఎదుర్కొంటాం. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నిస్తే తప్పకుండా జవాబు చెబుతాం. ఏదో మీడియాలో లీకులిచ్చి, నాయకుల మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే దాన్ని ప్రజలు తిప్పిగొడుతారని మోదీకి తెలియజేస్తున్నాను. ఈ పంథాను మార్చుకోవాలి అని కవిత సూచించారు.
జైల్లో పెడుతాం అంటే పెట్టుకో..
ప్రజాస్వామ్యయుతంగా ప్రజల వద్దకు వెళ్లి గెలవాలి కానీ ఈడీలను, సీబీఐలను ప్రయోగించి గెలువాలనుకుంటే.. మరి ముఖ్యంగా అత్యంత ప్రజా చైతన్యం ఉన్న తెలంగాణ గడ్డ మీద మీకు సాధ్యపడదు అని తెలియజేస్తున్నాను. ఇక కాదు కూడదు.. అది జేస్తం.. ఇది జేస్తం.. జైల్లో పెడుతాం అంటే పెట్టుకో. ఏమైతది. భయపడేది ఏముంది.
ఏం చేస్తరు. ఎక్కువల ఎక్కువ ఉరి ఎక్కిస్తారా? ఎక్కువల ఎక్కువ అంటే జైళ్ల పెడుతరు. పెట్టుకోరాదు.. ఏమైతది. ప్రజలు మన వెంట ఉన్నంతకాలం ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తున్నంత కాలం ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాదని తెలియజేస్తున్నాను. ఏజెన్సీలను స్వాగతిస్తున్నాం. మేం పూర్తిస్థాయిలో సహకరిస్తాం. మేం ఎవరికీ భయపడం అని కవిత పేర్కొన్నారు.