Medak: జీతాలు 1న చెల్లించాల‌ని DTO కార్యాలయం ఎదుట USPC ఆందోళన

డిమాండ్లు చెల్లించ‌ని ప‌క్షంలో చ‌లో సెక్ర‌టేరియ‌ట్ చేస్తామ‌ని హెచ్చ‌రిక‌ విధాత, మెదక్ బ్యూరో: ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ఈ కుబెర్‌లో ఉన్న అన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం యూఎస్పిసి జిల్లా స్టీరింగ్ కమిటీ అధ్వర్యంలో జిల్లా ఖజానా అధికారి(డిటిఓ)(DTO) కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్పిసి(USPC) నాయకులు సంగయ్య, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్ రావ్, పద్మా రావ్‌లు మాట్లాడారు. ధనిక రాష్ట్రం అని చెప్పే […]

Medak: జీతాలు 1న చెల్లించాల‌ని DTO కార్యాలయం ఎదుట USPC ఆందోళన
  • డిమాండ్లు చెల్లించ‌ని ప‌క్షంలో చ‌లో సెక్ర‌టేరియ‌ట్ చేస్తామ‌ని హెచ్చ‌రిక‌

విధాత, మెదక్ బ్యూరో: ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ఈ కుబెర్‌లో ఉన్న అన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం యూఎస్పిసి జిల్లా స్టీరింగ్ కమిటీ అధ్వర్యంలో జిల్లా ఖజానా అధికారి(డిటిఓ)(DTO) కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్పిసి(USPC) నాయకులు సంగయ్య, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్ రావ్, పద్మా రావ్‌లు మాట్లాడారు.

ధనిక రాష్ట్రం అని చెప్పే ప్రభుత్వం ఒకటో తేదీ నాడు జీతాలు చెల్లించని పరిస్థితిలో ఉందని, అన్ని అలవెన్సులు జిపిఎఫ్ అడ్వాన్సులు, బీమా సొమ్ములు కూడా చెల్లింపులు జరగకపోవడంతో ఉద్యమం నిర్వహించాల్సి వచ్చిందని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి అని ఉద్యమం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు.

తెలంగాణ ఉద్యమం నిర్వహించింది నీళ్ళు, నిధుల కోసమని, నేడు ఉద్యోగుల భవిష్య నిధి, జీవితా బీమా, మెడికల్ బిల్లులు కూడా చెల్లించని దుస్థితికి రావడం ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, దుబారా ఖర్చులు ప్రధాన కారణమని వారు విమర్శించారు. ఇకనైనా ఈ ప్రభుత్వము ఈ మూడు రోజులలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే 28నాడు చలో సెక్ర‌టేరియట్ యూఎస్పిసి అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు.

ఏ ప్రభుత్వమూ ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరించలేదని, ఉపాధ్యాయుల‌ హక్కుగా రావాల్సిన బకాయిలు కూడా చెల్లించక పోవడం విచారకరమన్నారు. టిపిటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వము అవలంబిస్తున్న ఆర్థిక విధానాలను పునః పరిశీలన చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో టిపిటీఎఫ్ ఆడిట్ కమిటీ కన్వీనర్ యాదగిరి, ఉపాధ్యాయ దర్శిని ఎడిటర్ శశిధర్ రెడ్డి, టిపిటీఎఫ్ జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్, మధుసూదన్ రెడ్డి, రాజయ్య, అల్వాల రమేష్, హీరా లాల్, దేవీ సింగ్, గోపాల్, రామచంద్ర రెడ్డి, సురేందర్, యాదగిరి, పద్మ, సంగీత, విజయకుమార్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింగం, కొమ్మ రమేశ్, నజీరొడ్డిన్, ముద్దుల సత్యం, మంగ్యా నాయక్ , సాయి బాబా, విఠల్ రెడ్డి, లక్ష్మణ్ టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు శీతల్ సింగ్, రవీందర్ రెడ్డి, భూషణం, సుధాకర్, అజయ్, అధిక సంఖ్య‌లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.