Warangal | గ్రామీణ ప్రాంతాల్లో కార్పోరేట్ వైద్యం: బండా ప్రకాష్
Warangal వైద్యరంగానికి రాష్ట్రం పెద్ద పీట నర్సంపేట సెగ్మెంట్ ముందంజ శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. వైద్య రంగానికి పెద్దపీట వేసి బడ్జెట్లోనే అత్యధిక భాగం వైద్యం మీద ఖర్చుపెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది […]

Warangal
- వైద్యరంగానికి రాష్ట్రం పెద్ద పీట
- నర్సంపేట సెగ్మెంట్ ముందంజ
- శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. వైద్య రంగానికి పెద్దపీట వేసి బడ్జెట్లోనే అత్యధిక భాగం వైద్యం మీద ఖర్చుపెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నర్సంపేటలో బుధవారం నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా బండా ప్రకాష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండా ప్రకాష్ మాట్లాడుతూ నూతన ఆసుపత్రులను నిర్మించి, డాక్టర్లను నియమించి, అధునాతనమైన పరికరాలను ఏర్పాటు చేసి పేదలకు ఖరీదైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
కెసిఆర్ కిట్టు, అమ్మ ఒడి, కెసిఆర్ న్యూట్రీషియన్ కిట్టు, కంటి వెలుగు, అందరికీ వైద్య పరీక్షలు, డయాలసిస్ సెంటర్ల ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించడం లాంటి ఎన్నో రకాల వసతులను ప్రభుత్వ దవాఖానాలో మెరుగుపరచినట్లు వివరించారు.
వైద్యసేవల్లో ముందంజ: పెద్ది
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మన నర్సంపేట నియోజకవర్గానికి ఎన్నో రకాల వసతుల కల్పన అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో నర్సంపేట ప్రజలను చైతన్యపరచిన నర్సంపేట వైద్య బృందాన్ని అభినందించారు.
కరోనా సమయంలో ఫ్రీ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు ఆలోచన నాదే. కానీ ఆచరణలో పెట్టి, వైద్య సేవలను అందించి 579 మంది ప్రాణాలను కాపాడిన ఘనత కేవలం నర్సంపేట వైద్య బృందానికే దక్కుతుందనీ, అందరికీ అభినందనలు తెలియజేశారు.
130 రకాల టెస్టులతో కూడిన రూ.70 కోట్లతో నర్సంపేట ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మంజూరు చేశారని, తుది దశకు నిర్మాణ పనులు చేరాయన్నారు. 57 రకాల టెస్టులకు సంబంధించి తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ సెంటర్, ఆక్సిజన్ సిలిండర్లు, కరోనాకు సంబంధించి RTPCR ల్యాబ్ లాంటి పలు రకాల వసతులు ఏర్పాటుచేశామన్నారు. CMRF/LOC ల ద్వారా 10 వేల మంది లబ్ధిదారులకు రూ.60 కోట్ల చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 49 హెల్త్ సబ్ సెంటర్లను మంజూరు చేశారని, నూతనంగా నర్సంపేటకు రూ.30 కోట్లతో 50 పడకల కిటికల్ కేర్ సెంటర్ కూడా మంజూరు చేశారని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే తెలియచేశారు..
ఈ కార్యక్రమంలో ODCMS చైర్మన్, ఆర్డీవో, RSS రాష్ట్ర డైరెక్టర్, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, వరంగల్ జిల్లా డిప్యూటీ DM&HO, ఇంచార్జి సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది, నర్సంపేట ప్రముఖ వైద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.