Warangal | ఆన్‌లైన్ గేమ్.. రూ.40వేలు ఖాళీ! తల్లిదండ్రులు తిడుతారని యువకుడు ఆత్మహత్య
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆన్ లైన్ గేమ్ కు ఓ యువకుడి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్ రావుపేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బాషబోయిన కమలాకర్-స్వప్న దంపతుల రెండో కొడుకు ఉదయ్(19) శుక్రవారం రాత్రి ఆన్లైన్ గేమ్ ఆడారు. ఈ క్రమంలో దాదాపు 40 వేల రూపాయలు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల మృతుడి తండ్రి ధాన్యం అమ్మిన డబ్బులు రూ.50వేలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆన్ లైన్ గేమ్ కు ఓ యువకుడి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్ రావుపేటలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బాషబోయిన కమలాకర్-స్వప్న దంపతుల రెండో కొడుకు ఉదయ్(19) శుక్రవారం రాత్రి ఆన్లైన్ గేమ్ ఆడారు. ఈ క్రమంలో దాదాపు 40 వేల రూపాయలు పోగొట్టుకున్నట్లు సమాచారం.
విషయం తెలిస్తే అమ్మానాన్న తిడుతారు.. లేక కొడుతారోననే భయంతో ఇంట్లో ఓ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.