BRS ను గద్దె దించుతాం: కర్ణాటక ఎమ్మెల్యే దొడ్డన్న గౌడ

BRS విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో బీఆరెస్ అవినీతి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని కర్ణాటక రాష్ట్రం కుష్టగి ఎమ్మెల్యే దొడ్డన్నగౌడ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా పాలమూరు నియోజకవర్గంలో వారం రోజులు పర్యటించిన ఆయన, ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, జాతీయ కౌన్సిల్ సభ్యులు పీ చంద్రశేఖర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈప్రాంత ప్రజలు అవినీతి ప్రభుత్వంలోని మంత్రుల అరాచకాల నుంచి విముక్తి కోరుకుంటున్నారని, […]

  • By: krs    latest    Aug 27, 2023 12:25 PM IST
BRS ను గద్దె దించుతాం: కర్ణాటక ఎమ్మెల్యే దొడ్డన్న గౌడ

BRS

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో బీఆరెస్ అవినీతి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని కర్ణాటక రాష్ట్రం కుష్టగి ఎమ్మెల్యే దొడ్డన్నగౌడ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా పాలమూరు నియోజకవర్గంలో వారం రోజులు పర్యటించిన ఆయన, ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, జాతీయ కౌన్సిల్ సభ్యులు పీ చంద్రశేఖర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఈప్రాంత ప్రజలు అవినీతి ప్రభుత్వంలోని మంత్రుల అరాచకాల నుంచి విముక్తి కోరుకుంటున్నారని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడి గెలిచే పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక్క బీజేపీ అని బలంగా ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకు అనుగుణంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

వారం రోజులపాటు హన్వాడ, మహబూబ్ నగర్ రూరల్, పట్టణ కేంద్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వారి అభిప్రాయాలను అధిష్టానానికి తెలియపరుస్తానన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమష్టి కృషితో పనిచేసి గెలిపించుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజా రెడ్డి, పడాకుల బాలరాజు, జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ వర్ధన్ రెడ్డి, క్రిస్టియ నాయక్, అసెంబ్లీ కన్వీనర్ అచ్చిగట్ల అంజయ్య, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వేణి అమ్మ, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి,. పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్, మహబూబ్ నగగర్ రూరల్ మండల అధ్యక్షుడు రాజు గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ యాదవ్, జామ్ శ్రీనివాసులు యాదవ్ పాల్గొన్నారు.