1949 నాటి రామ్‌లల్లా విగ్రహం పరిస్థితి ఏంటి?

అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేసిన ప్రాంతంలో నిర్మించిన రామాలయంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానికి జనవరి 22న అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ చేశారు

  • By: Somu    latest    Jan 23, 2024 12:32 PM IST
1949 నాటి రామ్‌లల్లా విగ్రహం పరిస్థితి ఏంటి?
  • ఆనాడు బాబ్రీ మసీదులో ప్రత్యక్షమైన విగ్రహాన్ని ఏం చేస్తారు?

అయోధ్య: అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేసిన ప్రాంతంలో నిర్మించిన రామాలయంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానికి జనవరి 22న అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. దానిని బీజేపీ తన రాజకీయ కార్యక్రమంగా తయారు చేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదంతా పక్కన పెడితే.. 1949 డిసెంబర్‌ 22 అర్ధరాత్రి బాబ్రీమసీదు మధ్య గుమ్మటం కింద కనిపించిన రామ్‌ లల్లా విగ్రహం పరిస్థితి ఏంటి? దానిని ఏం చేస్తారు? చాలామందిలో ఈ సందేహం ఉన్నది.


అయితే.. మరో భారీ కార్యక్రమం నిర్వహించి, పాత రామ్‌లల్లా విగ్రహాన్ని కూడా కొత్త ఆలయం గర్భగుడిలోనే ప్రతిష్ఠించబోతున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన దగ్గర నుంచీ దానిని తాత్కాలికంగా టెంట్‌వేసి అందులో ఉంచారు. దీనిని కూడా కొత్త ఆలయంలోకి తరలించి, తగిన పీఠంపై ఏర్పాటు చేస్తామని అధికారులు, పూజారులు చెప్పారు. కొత్త విగ్రహానికి సరిగ్గా ఎదురుగానే పాత విగ్రహం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఒక టెంట్‌లో ఉన్న పాత విగ్రహాన్ని ప్రత్యేక పూజల ద్వారా కొత్త ఆలయంలోకి తీసుకువస్తామని తెలిపారు.