WhatsApp | యూజర్లకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్..! ఇక తేలిగ్గా కాపీ చేసేయండి..!
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అప్డేట్స్ను తీసుకువస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో వాట్సాప్‌కి ఉన్నంత క్రేజ్ మరోదానికి లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ను తీసుకొచ్చిన వాట్సార్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నది. ఇమేజ్‌ల నుంచి టెక్స్ట్‌ను కాపీ చేసేందుకు మొబైల్ యూజర్లు కాపీ చేసేందుకు ఇబ్బందులుపడుతున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ప్రత్యేకంగా యాప్స్ వెతుకుతూ సమయం వృథా చేస్తుంటారు. ఈ క్రమంలో వాట్సాప్ […]

WhatsApp |
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అప్డేట్స్ను తీసుకువస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో వాట్సాప్‌కి ఉన్నంత క్రేజ్ మరోదానికి లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ను తీసుకొచ్చిన వాట్సార్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నది.
ఇమేజ్‌ల నుంచి టెక్స్ట్‌ను కాపీ చేసేందుకు మొబైల్ యూజర్లు కాపీ చేసేందుకు ఇబ్బందులుపడుతున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ప్రత్యేకంగా యాప్స్ వెతుకుతూ సమయం వృథా చేస్తుంటారు. ఈ క్రమంలో వాట్సాప్ ‘టెక్స్ట్ డిటెక్షన్’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ప్రస్తుతానికి వాట్సాప్ iOS-16 యూజర్లకు మాత్రమే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
దీంతో ఫొటోల నుంచి టెక్ట్స్‌ను తేలిగ్గా కాపీ చేసుకోవచ్చు. వాట్సాప్ వెర్షన్ 23.5.77కి అప్డేట్ చేసిన iOS-16 యూజర్లందరికీ టెక్స్ట్ డిటెక్షన్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని WABetaInfo రిపోర్ట్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందని తెలుపలేదు.
అలాగే iOS యూజర్లు ఇక మీదట నుంచీ వాయిస్ నోట్స్ ఉపయోగించి స్టేటస్ అప్డేట్స్ను పోస్ట్ చేయవచ్చు. పిక్చర్-ఇన్-పిక్చర్ వీడియో సపోర్ట్ కూడా ఇందులో ఆఫర్ చేసింది. ఈ ఫీచర్ కోసం ప్రత్యేకంగా కొంతమంది లేదంటే.. ఒకరిని కూడా ఎంచుకోవచ్చు.
దాంతో మనం ఎవరి కోసం అయితే స్టేటస్ పెట్టామో వారికి మాత్రమే కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు 30 సెకన్ల వరకు ఆడియో స్టేటస్‌ను సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్టేటస్ రియాక్షన్ ఫీచర్ సైతం జోడించింది.