WhatsApp | ఈ ఫోన్లలో ఇక వాట్సాప్ పని చేయదు..! అక్టోబర్ 24 డెడ్‌లైన్..!

WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తుంది. అదే సమయంలో సెక్యూరిటీ పరంగా అప్‌డేట్స్‌ను తీసుకువస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ వర్షన్ యూజర్లందరికీ సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే పాత వర్షెన్ మొబైల్ డివైజ్‌లకు సపోర్ట్‌ను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో మోడల్స్‌కు సపోర్ట్ నిలిపివేసిన వాట్సాప్ తాజాగా అక్టోబర్‌లో మరికొన్ని మోడల్స్‌కు సైతం సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్ వెర్షన్ ఫోన్లకు సపోర్ట్ నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
అక్టోబర్ 24 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. పలు రకాల డివైజ్‌లకు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అన్ని కంపెనీలు సైతం అదే పని చేస్తున్నాయని పేర్కొంది. ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్, అంతకంటే తక్కువ వెర్షన్‌తో పనిచేస్తున్న మోడల్స్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉన్న ఫోన్లు, ట్యాబ్‌లు పెద్దగా వాడుకలో లేనప్పటికీ.. ప్రస్తుతం ఎవరైనా ఆయా మోడల్స్‌ను వాడుతున్నట్లయితే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. వాట్సప్ సపోర్ట్ నిలిచిపోతే.. ఆయా ఫోన్లకు సర్వీసులు నిలిచిపోతాయని.. ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ 5.0, ఐఫోన్ 12, కాయ్ ఓఎస్ 2.5.0 (జియో ఫోన్లు) ఓఎస్‌లతో నడుస్తున్న డివైజెస్‌లో వాట్సప్ సేవలు కొనసాగనున్నాయి.
వాట్సాప్ సపోర్ట్ బంద్ చేయనున్న మోడల్స్ ఇవే..
అక్టోబర్ నుంచి సపోర్ట్ నిలిపివేయనున్న మోడల్స్‌ను వాట్సాప్ ప్రకటించింది. ఈ జాబితాలో నెక్సస్ 7, శాంసంగ్ గెలాక్సీ నోట్ 2, హెచ్‌టీసీ వన్, సోనీ ఎక్స్‌పీరియా జడ్, ఎల్‌జీ ఆప్టిమస్ జీ ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్2, శాంసంగ్ గెలాక్సీ నెక్సస్ ఉన్నాయి. అలాగే హెచ్‌టీసీ సెన్సేషన్, మోటోరొలా డ్రాయిడ్ రేజర్, సోనీ ఎక్స్‌పీరియా ఎస్2, మోటోరొలా జూమ్, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1లో ఇక వాట్సాప్ పని చేయదు. ఆసుస్ ఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్, ఏసర్ ఐసోనియా ట్యాబ్ ఏ5003, శాంసంగ్ గెలాక్సీ ఎస్, హెచ్‌టీసీ డిజైర్ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్ 2 ఎక్స్, సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఆర్క్3 ఫోన్లకు సపోర్టును నిలిపివేయనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.