జనసేనాని ఏమయ్యారు.. ? జైల్లో బాబుతో ములాఖత్ తరువాత మళ్ళీ జాడలేదు

జనసేనాని ఏమయ్యారు.. ? జైల్లో బాబుతో ములాఖత్ తరువాత మళ్ళీ జాడలేదు

చంద్రబాబు కేసులు.. క్వాష్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేత.. సీఐడీ కష్టడీకి రెండ్రోజులు అనుమతి.. రాష్ట్రంలో ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణుల ఆందోళనలు.. ఇంత హడావుడి జరుగుతున్నా జనసేనాని సందడి లేదు. చంద్రబాబు అరెస్ట్ అయిన మరునాడు అంటే సెప్టెంబర్ 14న లోకేష్.. బాలయ్యతో కలిసి జైల్లో ములాఖత్ లో చంద్రబాబును కలిశారు. ప్రత్యేక విమానంలో వచ్చిమరీ చంద్రబాబును కలవడమే కాకుండా టిడిపితో పొత్తు పెట్టుకుంటాం అని ఘనంగా ప్రకటించారు. దీనికోసం నాదెండ్ల మనోహర్ సారధ్యంలో పొత్తుల కమిటీ కూడా వేశారు. 

అయితే అది ఎక్కడ ఉందో.. ఆ కమిటీ ఏమి తేల్చిందో.. ఏమీ తెలియరాలేదు.. ఇక పవన్ సైతం ఆ తరువాత మళ్ళీ ఆంధ్రాలో ఎక్కడా జాడలేదు.. హైదరాబాద్ లో ఉన్నారని,షూటింగుల్లో బిజీ అని అంటున్నారు. ఇక లోకేష్ సైతం వారం రోజులుగా జాతీయ నాయకుల మద్దతు పొందే నెపంట్లో ఢిల్లీలో ఉంటున్నారు. అక్కడ అయన ఎంపీలతో మాట్లాడుతూ వీడియోలు విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సైతం ఇప్పుడు ఇక్కడ చప్పుడు లేదు. చంద్రబాబుకు కోర్టులో బెయిల్ రాకపోగా అటు సీఐడీ కష్టడీకి సైతం కోర్టు అనుమతించింది. ఇలాంటి పరిస్థితుల్లో అయినా పవన్ సౌండ్ చేస్తారు అనుకుంటే ఏమీ లేదు. రాష్ట్రంలో యనమల రామకృష్ణుడు.. ఇంకొద్ది మంది మాత్రం అలా అలా ఏదేదో మాట్లాడుతూ మీడియా ముందుకు వస్తున్నారు.

ఇక జనసేనతో పొత్తు గురించి కార్యాచరణ ఎలా ప్లాన్ చేస్తారు.. టిడిపి నుంచి ఎవరెవరు పాల్గొంటారు అనేది ఇంకా తేలలేదు.. దీంతో అటు జనసైనికులు సైతం అంటా అయోమయంగా చూస్తున్నారు. పవన్ మళ్ళీ రావాలి.. పిలుపు నివ్వాలి.. మార్గదర్శనం చేయాలి అని వాళ్ళు చూస్తున్నారు.