Yadadri | వైభవంగా శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలు
Yadadri విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలు మంగళవారం పాంచరాత్రాగమ శాస్త్రానుసారం వైభవైపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి గర్భాలయంలో నిత్యారాధన అనంతరం శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధన,పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం లక్ష కుంకుమార్చన నిర్వహించారు. స్వామివారికి తిరు వెంకటపతి అలంకార సేవ నిర్వహించారు. సాయంత్రం అంకురారోపణ, హవనం అనంతరం స్వామివారిని పరవాసుదేవుడిగా అలంకరించి గడవాహనంపై ఊరేగించారు. రాష్ట్ర దేవాదాయ […]

Yadadri
విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలు మంగళవారం పాంచరాత్రాగమ శాస్త్రానుసారం వైభవైపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి గర్భాలయంలో నిత్యారాధన అనంతరం శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధన,పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం లక్ష కుంకుమార్చన నిర్వహించారు. స్వామివారికి తిరు వెంకటపతి అలంకార సేవ నిర్వహించారు.
సాయంత్రం అంకురారోపణ, హవనం అనంతరం స్వామివారిని పరవాసుదేవుడిగా అలంకరించి గడవాహనంపై ఊరేగించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలు నృసింహ జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు.
ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ అర్చక బృందం పాల్గొన్నారు. పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ శ్రీ నృసింహ జయంతి మహోత్సవాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు.