తప్పైంది మన్నించండి.. పరిటాల సునీత కాళ్ల మీద‌ పడ్డ వైసీపీ కార్యకర్త!

విధాత‌: పాపం ఓ కార్యకర్త పరిస్థితి పొయ్యిమీద నుంచి పెనం మీద పడినట్లు అయింది. ఇక్కడ బాలేదు.. ఆ పార్టీవైపు వెళ్లి కాస్త కుదురుకుంటాను. పొలిటికల్ కెరీర్ ఉంటుందేమో అనుకుని వెళ్ళాడు. ఉన్న కొమ్మను వదిలేసి అవతలి కొమ్మకు ఆశ పడ్డాడు.. అది కాస్తా బలహీనమైనది కావడంతో డబేల్మని కింద పడ్డాడు. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలక బోసుకున్నట్లు అయిందంటూ బాధ పడ్డారు.. వెనువెంటనే పాత నాయకత్వం కాళ్ళ మీద పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా […]

తప్పైంది మన్నించండి.. పరిటాల సునీత కాళ్ల మీద‌ పడ్డ వైసీపీ కార్యకర్త!

విధాత‌: పాపం ఓ కార్యకర్త పరిస్థితి పొయ్యిమీద నుంచి పెనం మీద పడినట్లు అయింది. ఇక్కడ బాలేదు.. ఆ పార్టీవైపు వెళ్లి కాస్త కుదురుకుంటాను. పొలిటికల్ కెరీర్ ఉంటుందేమో అనుకుని వెళ్ళాడు. ఉన్న కొమ్మను వదిలేసి అవతలి కొమ్మకు ఆశ పడ్డాడు.. అది కాస్తా బలహీనమైనది కావడంతో డబేల్మని కింద పడ్డాడు.

మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలక బోసుకున్నట్లు అయిందంటూ బాధ పడ్డారు.. వెనువెంటనే పాత నాయకత్వం కాళ్ళ మీద పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో వైసీపీ కార్యకర్త ఒకరు ఆ పార్టీలో చేరి తప్పు చేశానంటూ టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు.

మరూరులో పరిటాల సునీత.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ముచ్చుమర్రి రామాంజనేయులు అనే వైసీపీ కార్యకర్త ఒక్కసారిగా సునీత కాళ్లపై పడి క్షమించాలంటూ వేడుకున్నాడు. 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశానంటూ పశ్చాత్తాప పడ్డారు.

తనను తిరిగి టీడీపీలో చేర్చుకోవాలని ప్రాధేయ పడ్డాడు. దీంతో పరిటాల సునీత కూడా అతడికి అభయమిచ్చారు. జరిగిందేదో జరిగిపోయిందని.. టీడీపీలో ఎప్పటికీ మీ లాంటి వాళ్లకు చోటు ఉంటుందని భరోసా ఇస్తూ రామాంజనేయులకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు.

ప్రస్తుతం రాప్తాడులో వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఉండగా ఈసారి మళ్ళీ టిడిపి నుంచి బరిలోకి దిగేందుకు సునీత సిద్ధం అవుతున్నారు. కొడుకు శ్రీరామ్ కూడా ధర్మవరం టికెట్ కోరుతున్నారు.

అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్స్ ఇస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అలా ఇవ్వాలంటే దాదాపు పదికి పైగా కుటుంబాలు రెండేసి టికెట్స్ కోరుతున్నాయి. మరి ఈ పరిస్థితి మీద చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.