కుక్క‌కు 9 పిల్ల‌లు పుట్టినందుకు భారీ విందు..

మామూలుగా ఇంట్లో పిల్ల‌లు పుట్టిన స‌మ‌యంలో బంధు మిత్రుల‌ను పిలిచి భోజ‌నం పెట్ట‌డం ప‌రిపాటి. కానీ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక మ‌హిళ‌ చేసిన ప‌ని మాత్రం నివ్వెర‌బోయేట్టు చేసింది.

కుక్క‌కు 9 పిల్ల‌లు పుట్టినందుకు భారీ విందు..
  • కుక్క‌కు 9 పిల్ల‌లు పుట్టినందుకు భారీ విందు..

ల‌క్నో: మామూలుగా ఇంట్లో పిల్ల‌లు పుట్టిన స‌మ‌యంలో బంధు మిత్రుల‌ను పిలిచి భోజ‌నం పెట్ట‌డం ప‌రిపాటి. కానీ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక మ‌హిళ‌ చేసిన ప‌ని మాత్రం నివ్వెర‌బోయేట్టు చేసింది. ఆమె పెంచుకుంటున్న కుక్క‌.. ఏకంగా 9 కుక్క‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఆ ఆనందంలో భారీ విందు ఏర్పాటు చేసింది. ఆ విందులో కనీసం 400 మంది భోజనాలు ఆరగించి, ఇటు వాళ్ళు సంతోషపడి, అటు యజమానురాలిని సంతోషపరిచారట.


వివరాల్లోకెళ్తే ఉత్తరప్రదేశ్లో మేరా పూర్ కు చెందిన రాజ్ కాళీ అనే మహిళ చట్నీ అనే కుక్కని చాలా కాలంగా పెంచుకుంటున్న‌ది. ఆ కుక్క ఇటీవల తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో గ్రామస్తులు బంధువులకు ఆ మహిళ బుధవారం పెద్ద విందును ఏర్పాటు చేసింది.


విందులో పాల్గొన్న వారందరూ ఆ ఇంట్లో ఏదో మంచి శుభకార్యం అనుకొని పెద్ద ఎత్తున వచ్చి ఆ విందులో పాల్గొని భోజనాలు తదితరాలు ఆరగించి అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత చివరకు ఈ విందు కారణమేంటి అనే విషయం తెలిసిన తర్వాత అందరూ ఒక్కసారి విస్తుపోయార‌ట‌. అసలు విషయం ఏంటంటే ఈ విందు సందర్భంగా ఆ చిన్న కుక్క పిల్లలను ఆమె అందంగా అలంకరించి, అందరికీ వాటిని గొప్పగా చూపించడంతో అసలు విందుకు కారణం ఇదా అని వాళ్ళందరూ నోరెళ్ళ పెట్టారట.