Jagdeep Dhankhar | పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్న మాజీ ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్..!
Jagdeep Dhankhar | భారత మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్( Jagdeep Dhankhar )పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్( Pension ) కోసం జగదీప్ ధన్‌ఖడ్ దరఖాస్తు చేసుకున్నట్లు రాజస్థాన్ అసెంబ్లీ( Rajasthan Assembly ) అధికారులు అధికారికంగా ప్రకటించారు.

మాజీ రాష్ట్రపతి ధన్‌ఖడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 1993 – 98 మధ్య కిషన్‌గర్హ్ నియోజకవర్గం( Kishangarh Assembly constituency ) నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019 జులై వరకు మాజీ శాసనసభ్యుడిగా జగదీప్ పెన్షన్ తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియామకమైన తర్వాత పెన్షన్ తీసుకోలేదు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ ఏడాది జులై 21న ఉప రాష్ట్రపతి పదవికి దన్‌ఖడ్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో తాజాగా మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జగదీప్ దన్‌ఖడ్ పెన్షన్ దరఖాస్తును స్వీకరించామని, ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన రోజు నుంచి ఆయనకు పెన్షన్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
మాజీ ఉప రాష్ట్రపతికి పెన్షన్ ఎంతంటే..?
ప్రస్తుతం రాజస్థాన్‌లో మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.35,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. మాజీ ఎమ్మెల్యే వయస్సు 70 ఏళ్లు పైబడి ఉంటే, వారికి 20 శాతం అదనపు పెన్షన్, 80 ఏళ్ల వయసులో 30 శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది. దన్‌ఖడ్ వయస్సు ప్రస్తుతం 74 సంవత్సరాలు, కాబట్టి అతనికి 20 శాతం అదనపు పెన్షన్‌తో దాదాపు రూ.42,000 పెన్షన్ లభించనుంది.