Calcutta trainee doctor murder case । వాడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. సున్నిత మనస్కులు ఈ వార్తను చదవొద్దు
తనపై అఘాయిత్యాన్ని కోల్‌కతా మెడికో తీవ్రంగా ప్రతిఘటించింది.. కానీ రాక్షసుడి ముందు ఆమె నిలువలేక పోయింది. కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో లైంగిక దాడికి, హత్యకు గురైన మెడికో మృతదేహం పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. విధి నిర్వహణలో భాగంగానే ఈ వార్త ప్రచురించాల్సి వస్తున్నది.. సున్నిత మనస్కులు ఈ వార్త చదవకపోవడమే మంచిది.

మర్మాంగాన్ని ఛిద్రం చేసి.. గోడకు తలను బాది..
మరణానికి ముందు మెడికోకు నరకం చూపాడు
కోల్‌కతా జూనియర్ డాక్టర్ పోస్టుమార్టం నివేదిక
Calcutta trainee doctor murder case । కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో దారుణ హత్యకు గురైన మెడికో పోస్టుమార్టం నివేదిక బయటపెట్టకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో పోలీసులు స్పందించారు. దారుణానికి గురైన మృతురాలి ఒంటిపై గాయాల వివరాలను, అవి జరిగిన తీరును బయటపెట్టారు. పోస్టుమార్టం నివేదిక (post-mortem report) చూస్తే మృతురాలు ఎంతటి నరకం అనుభవించిందో, ఎంత హింసకు గురైందో అర్థం అవుతున్నది.
పోస్టుమార్టం నివేదికను మృతురాలి కుటుంబీకులకు పోలీసులు (Kolkata Police) సోమవారం అందించారు. 31 ఏళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ హత్యకు ముందు జరిగిన దృశ్యాన్ని పోస్టుమార్టం (autopsy) నివేదిక వెల్లడిస్తున్నది. చనిపోవడానికి ముందు బాధితురాలు శారీరకంగా తీవ్ర హింసకు గురైనట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించినట్టు తెలుస్తున్నది. తలను గోడకేసి బాదాడు. దాని ఫలితంగా ఆమె కండ్లజోడు (spectacles) ముక్కలై.. కొన్ని ముక్కలు ఆమె కళ్లలోకి కూడా చొచ్చుకుపోయాయి. అందుకే ఆమె కంటి నుంచి రక్తస్రావమైనట్టు నివేదికలో తెలిపారు.
చేతులు, ముఖంపై ఆమెకు చాలా గాయాలు ఉండటం చేస్తూ బాధితురాలు తనపై అఘాయిత్యాన్ని తీవ్రంగా ప్రతిఘటించినట్టు (desperate struggle) తెలుస్తున్నది. ఆమె మృతదేహాన్ని శుక్రవారం ఉదయం హాస్పిటల్ సెమినార్ హాల్లో కనుగొన్నారు. ఆమె మర్మాంగాలపై (private parts) తీవ్ర గాయాలు గమనిస్తే ఆమె లైంగిక దాడికి గురైనట్టు అర్థమవుతున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆమె శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి 5 గంటల మధ్య చనిపోయి ఉండొచ్చని పోస్టుమార్టం నివేదిక అంచనా వేసింది.
ఆమెను శారీరకంగా తీవ్రంగా హింసించిన (unimaginable torture) నిందితుడు ఆమె గొంతు పిసకడంతో ఆమె థైరాయిడ్ మృదులాస్థి (thyroid cartilage) విరిగిపోయిందని పోస్టుమార్టం నివేదిక పేర్కొంటున్నది. మరీ దారుణం ఏమిటంటే.. ఆమె మర్మాంగాలకు జరిగిన గాయాలను గమనిస్తే నిందితుడు సైకోలా వ్యవహరించి, విశృంఖల (perverted) లైంగికతకు, ఆమె మర్మాంగాలపై విచక్షణారహిత దాడికి పాల్పడినట్టు అర్థమవుతున్నది.
ఈ కేసును తొలుత కలకత్తా పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తుండగా.. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.
మరిన్ని వార్తలు ఇక్కడ చదవండి..
Hyderabad Metro | హైదరాబాద్‌లో 6.42కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో