Indian Railway | భారతీయ రైల్వే అధికారులను ఏకిపడేసిన నెటిజన్లు..! ఎక్స్‌ప్రెస్‌ రైలు పేరు తప్పే కారణం..!

Indian Railway | చిన్న పొరపాటు కారణంగా భారతీయ రైల్వే తీవ్ర విమర్శలతో పాటు ట్రోలింగ్‌కు గురవుతున్నది. దేశంలోనే భారీ ప్రజా రవాణా వ్యవస్థ అయిన రైల్వేలో చిన్న తప్పును గుర్తించకపోవడం ఏంటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకు నెటిజన్ల ఆగ్రహానికి గురైణ కారణం ఏంటంటే.. ఓ రైలుకు రాసిన పేరులో తప్పే కారణం. ప్రయాణికులు రైళ్లను వాటి పేర్ల ఆధారంగానే గుర్తిస్తుంటారు. అదే సమయంలో టికెట్లను బుక్‌ చేసుకుంటుంటారు.

Indian Railway | భారతీయ రైల్వే అధికారులను ఏకిపడేసిన నెటిజన్లు..! ఎక్స్‌ప్రెస్‌ రైలు పేరు తప్పే కారణం..!

Indian Railway | చిన్న పొరపాటు కారణంగా భారతీయ రైల్వే తీవ్ర విమర్శలతో పాటు ట్రోలింగ్‌కు గురవుతున్నది. దేశంలోనే భారీ ప్రజా రవాణా వ్యవస్థ అయిన రైల్వేలో చిన్న తప్పును గుర్తించకపోవడం ఏంటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకు నెటిజన్ల ఆగ్రహానికి గురైణ కారణం ఏంటంటే.. ఓ రైలుకు రాసిన పేరులో తప్పే కారణం. ప్రయాణికులు రైళ్లను వాటి పేర్ల ఆధారంగానే గుర్తిస్తుంటారు. అదే సమయంలో టికెట్లను బుక్‌ చేసుకుంటుంటారు. అలాంటి పేరు తప్పుగా రాస్తే ఏమవుతుందో చెప్పాల్సిన పని లేదు. నెటిజన్ల నుంచి ఎదురైన విపరీతమైన ట్రోలింగ్‌తో రైల్వేశాఖ దిగి వచ్చి తప్పును సరిదిద్దింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాజధాని రాంచీలోని హటియా నుంచి కేరళలోని ఎర్నాకుళం వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తూ వస్తున్నది.

అయితే, ఆ రైలుకు ‘హటియా ఎక్స్‌ప్రెస్‌’గా పేరు పెట్టారు. అయితే, హటియా ఎక్స్‌ప్రెస్‌ పేరును రైల్వే అధికారులు గూగుల్‌ ట్రాన్స్‌లేషన్‌ ఉపయోగించి ఇంగ్లింష్‌ నుంచి మలయాళంలోకి అనువదించారు. ఇక హటియా కాస్త.. హతియాగా మారింది. హతియా అంటే హంతకుడు కాగా.. మలయాళంలో ‘కోలపథకం’ రైలు పేరును రాశారు. దీంతో హటియా ఎక్స్‌ప్రెస్‌ పేరు కాస్త మర్డర్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారింది. అయితే, ఇది గుర్తించని రైల్వేశాఖ అధికారులు రైలు నేమ్‌ బోర్డుపై అదే పేరును రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రైల్వే అధికారులపై నెటిజన్లు మండిపడ్డారు. చివరకు స్పందించిన అధికారులు తప్పును గుర్తించి సరి సరి చేసినట్లు రాంచీ డివిజన్ అధికారులు తెలిపారు.