దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన ప్రాంతాలు, కూడ‌ళ్ల‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌టౌట్‌లు ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వాటిని మోదీ సెల్ఫీ పాయింట్‌లుగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది

దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన ప్రాంతాలు, కూడ‌ళ్ల‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌టౌట్‌లు ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వాటిని మోదీ సెల్ఫీ పాయింట్‌లుగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే మోదీ క‌టౌట్‌ల వ‌ద్ద సెల్ఫీలు దిగి కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే ఉద్దేశంతోనే బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. రైల్వే స్టేష‌న్లు, రేష‌న్ షాపులతో పాటు ప్ర‌ధాన ప్రాంతాల్లో దేశ వ్యాప్తంగా మోదీ క‌టౌట్‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

అయితే ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మోదీ క‌టౌట్ వ‌ద్ద ఓ మ‌హిళ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించింది. మోదీ క‌టౌట్‌ను కౌగిలించుకుంది. అంత‌టితో ఆగ‌కుండా అశ్లీల నృత్యం చేసింది. దానికి తోడుగా ఓ బాలీవుడ్ సాంగ్ ప్లే అయింది. ప్ర‌ధాని క‌టౌట్ వ‌ద్ద‌ అస‌భ్యంగా ఆమె డ్యాన్స్ చేయ‌డంతో నెటిజ‌న్లు, మోదీ మ‌ద్ద‌తుదారులు మండిప‌డుతున్నారు. బాలీవుడ్ సాంగ్‌కు ఆ మ‌హిళ ఇన్‌స్టా రీల్స్ కోసం మోదీ క‌టౌట్ వ‌ద్ద డ్యాన్స్ చేసిన‌ట్లు స‌మాచారం. ఆమె చీర ధ‌రించిన‌ప్ప‌టికీ, అర్ధ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేయండంతో నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దేశానికి ప్ర‌ధాని అయినా మోదీని ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వించాల‌ని, ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డటం స‌రైంది కాద‌ని నెటిజ‌న్లు హితవు పలుకుతున్నారు.

అయితే ఆ మ‌హిళ డ్యాన్స్ చేసిన బాలీవుడ్ సాంగ్.. మాధురి దీక్షిత్, సంజ‌య్ ద‌త్ న‌టించిన ఖ‌ల్‌నాయ‌క్ మూవీలోనిది. ఈ సినిమా 1993లో విడుద‌లైంది. అజా స‌జ‌న్ అజా అనే సాంగ్‌కు ఆమె డ్యాన్స్ చేసి అశ్లీలత‌ను ప్ర‌ద‌ర్శించారు. సాంగ్ ప్లే అవుతుండ‌గా.. ఆమె ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి మోదీ కటౌట్‌ను కౌగిలించుకుని, డ్యాన్స్ చేసిందామె.

Updated On 21 Feb 2024 2:19 PM GMT
Somu

Somu

Next Story