Warangal: ఏప్రిల్ 27న.. వరంగల్‌లో బీఆర్ఎస్ పండుగ

విధాత, వరంగల్ ప్రతినిధి: వచ్చే నెల 27న చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల పండుగ జరుపుకోనుందనీ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి వివరించారు.బుధవారం హనుమకొండ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమే అబ్బురపోయేలా సభలు సమావేశాలు నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా పేరొందిందన్నారు. 25 ఏండ్ల పండుగను వరంగల్ వేదికగా నిర్వహించ నీయకుండా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడడం సబబు కాదన్నారు.
రాజకీయాల్లో విమర్శలకు ఓ హద్దు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ కి ఒక చరిత్ర ఉంది. 25 ఏండ్ల పండుగ జరుపుకొంటున్న వేళ ఇలా విమర్శలు చేయడం మీ విజ్ఞతకే వొదిలేస్తున్నామన్నారు. రాజేందర్ రెడ్డి.. ప్రతీ సారి అభివృద్ధి, అభివృద్ధి బాగా మాట్లాడుతున్నావు.. నువ్వేదో ఈ నగరాన్ని నిర్మించినట్లు, మరో చంద్రబాబులా మాట్లాడుతున్నావని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితి, మీ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేకపోతున్నారన్నారు. కేవలం 15 నెలల్లోనే కాంగ్రెస్ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తోందన్నారు.
ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ , మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, నాయకలు జనార్ధన్ గౌడ్, పులి రజినీకాంత్, సారంగపాణి, నయీమొద్దీన్, రవీందర్ రావు, నార్లగిరి రమేష్, యాదగిరి, జానకి రాములు, రాజు, పరుశురాములు, ఖలీల్, మహేష్, రఘు, శ్రీధర్, ప్రశాంత్, వెంకన్న, యాకుబ్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.