గేమ్ చేంజర్ సినిమా సాంగ్ లీక్‌.. ఇద్దరి అరెస్టు

  • By: Somu    news    Nov 07, 2023 9:30 AM IST
గేమ్ చేంజర్ సినిమా సాంగ్ లీక్‌.. ఇద్దరి అరెస్టు

విధాత : మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్‌ సినిమా నుంచి ఓ పాటను లీక్ చేసిన ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సినిమా నుంచి దీపావళీ సందర్భంగా జరగండి జరగండి అనే పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సాంగ్ అంతకుముందే ఆన్‌లైన్‌లో లీక్ అయింది.


ఈ లీక్ పై మేకర్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్స్ డివిజన్ ఏసీపీ చంద్రబోస్ బృందం ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. వారు సెప్టెంబర్ లోనే 20సెకన్ల వీడియో సాంగ్‌ను లీక్ చేశారని గుర్తించారు. ప్రముఖ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న గేమ్ చేంజర్‌లో రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.