Gold Price | మగువలకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

Gold Price | నిజంగా మహిళలకు ఇది శుభవార్తే. నిన్న మొన్న పెరిగిన ధరలు శుక్రవారం తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌ దగ్గరపడుతుండడంతో పుత్తడిని కొనుగోలు చేసేందుకు దుకాణాలకు బారులు తీరుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,240 వద్ద ట్రేడవుతున్నది. బంగారంపై దాదాపు రూ.110 వరకు తగ్గింది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.61,340 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై […]

Gold Price | మగువలకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

Gold Price | నిజంగా మహిళలకు ఇది శుభవార్తే. నిన్న మొన్న పెరిగిన ధరలు శుక్రవారం తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌ దగ్గరపడుతుండడంతో పుత్తడిని కొనుగోలు చేసేందుకు దుకాణాలకు బారులు తీరుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,240 వద్ద ట్రేడవుతున్నది. బంగారంపై దాదాపు రూ.110 వరకు తగ్గింది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.61,340 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గి.. రూ.56,690 ధర పలుకుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పతనమై.. రూ. 61,840 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.110 తగ్గుదల నమోదై.. రూ.56,090, పది గ్రాముల 24 క్యారెట్స్‌ బంగారంపై రూ.120 తగ్గి.. రూ.61,190 వద్ద ఉన్నది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,090 వద్ద ఉండగా.. పది గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.61,190 పలుకుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,090, పది గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ.61,190, ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.56,090, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61,190గా ఉంది. ఇక వెండి ధరలు హైదరాబాద్‌, విశాఖపట్నంలో రూ.81,800 వరకు ధర పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో కరెన్సీ ధరల్లో మార్పులు, ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని ట్రేడ్‌ పండితులు పేర్కొంటున్నారు. దాంతో నిత్యం బంగారం ధరల్లో హెచ్చతగ్గులు నమోదవుతుంటాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.