క్రమబద్దీకరణ చేయండి.. ఇంటర్‌ మూల్యాంకన కేంద్రాల వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్స్ మౌన దీక్ష

విధాత: ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ గా పని చేస్తున్న తమను క్రమబద్దీకరించా లని కోరుతూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంటర్‌ మూల్యాకంన కేంద్రాల వద్ద కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ మౌన దీక్ష చేపట్టారు. శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఇంటర్‌ మూల్యాకంన కేంద్రాల వద్ద భోజన విరామ సమయంలో మౌన దీక్ష చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ మొదటి రోజు చేపట్టిన […]

  • By: krs    news    Apr 07, 2023 8:45 AM IST
క్రమబద్దీకరణ చేయండి.. ఇంటర్‌ మూల్యాంకన కేంద్రాల వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్స్ మౌన దీక్ష

విధాత: ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ గా పని చేస్తున్న తమను క్రమబద్దీకరించా లని కోరుతూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంటర్‌ మూల్యాకంన కేంద్రాల వద్ద కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ మౌన దీక్ష చేపట్టారు.

శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఇంటర్‌ మూల్యాకంన కేంద్రాల వద్ద భోజన విరామ సమయంలో మౌన దీక్ష చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ మొదటి రోజు చేపట్టిన మౌన దీక్ష విజయవంతం అయినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వర్కింగ్ అధ్యక్షులు జి రమణారెడ్డి, డాక్టర్ కుప్పిశెట్టి సురేష్, డాక్టర్ వసకుల శ్రీనివాస్ తెలిపారు.

ఏప్రిల్ ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్స్, ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రకటించడం జరిగిందని, కానీ ఏప్రిల్ ఏడో తారీకు వచ్చినప్పటికీ ఇంతవరకు క్రమబద్దీకరణ ఉత్తర్వులు రాకపోవడంతో కాంట్రాక్ట్ అధ్యాపకులు తీవ్ర మానసిక ఆవేదన చెందుతున్నారన్నారు. మంత్రి హరీశ్‌రావు తక్షణమే జోక్యం చేసుకొని క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వచ్చేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నాంపల్లి ఎంఏఎం కాలేజీలోని ఇంటర్ విద్య మూల్యాంకన కేంద్ర వద్ద మౌన దీక్ష చేపట్టారు. అనంతరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కార్యదర్శి శైలజ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ శ్రీనివాస్ ,ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు పరీక్షలు నియంత్రణ అధికారిని( COE) జయప్రద భాయిని కలిసి వినతిపత్రం అందించారు.

హన్మకొండ ఇంటర్ మూల్యాంకన కేంద్రం వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో మౌన ఆవేదన కార్యక్రమం నిర్వహించి క్యాంప్ అధికారి గోపాల్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి కస్తూర్బా ఇంటర్ మూల్యాంకనము కేంద్రం వద్ద రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కె.పి .శోభన్ బాబు ఆధ్వర్యంలో మౌన ఆవేదనను నిర్వహించి క్యాంపు అధికారి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, కాచిగూడ (వికారాబాద్ )ఇంటర్ మూల్యాంకన కేంద్రం వద్ద రాష్ట్ర లేడీ సెక్రెటరీ సంగీత ,రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ ఆధ్వర్యంలో మౌన ఆవేదన నిర్వహించి క్యాంపు అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

కరీంనగర్ ఇంటర్ మూల్యాంకనం కేంద్రం వద్ద రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవేందర్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల 475 అసోసియేషన్ నాయకులు ఆధ్వర్యంలో మౌన ఆవేదన కార్యక్రమం నిర్వహించి క్యాంపు అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నల్లగొండ ఇంటర్ మూల్యాంకన్ కేంద్రం వద్ద రాష్ట్ర నాయకులు సాయిలు , రాజు, జి వెంకటేశ్వర్లు , పూర్ణల ఆధ్వర్యంలో మౌన ఆవేదన నిర్వహించి క్యాంపు క్యాంప్ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

నిజామాబాద్ ఇంటర్ స్పాట్ కేంద్రం వద్ద లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల నాయకుల ఆధ్వర్యంలో మౌన ఆవేదనను నిర్వహించి క్యాంప్ అధికారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖమ్మం నయాబజార్ ఇంటర్ స్పాట్ కేంద్రం వద్ద అధ్యాపకులు మౌన ఆవేదన నిర్వహించి క్యాంప్ అధికారి రవిబాబుకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అసోసియేషన్‌ నాయకులు తెలిపారు.