Laughing trees | ఈ చెట్లకు చెక్కిలిగింతలు పెడితే నవ్వుతాయి.. ఈ నవ్వే చెట్లు ఎక్కడున్నాయో తెలుసా..?
Laughing trees : ముట్టుకుంటే చాలు నవ్వే చెట్లను మీరు ఎప్పుడైనా చూశారా..? మనం ముట్టుకున్నా, చెక్కిలిగింతలు పెట్టినా, కౌగిలించుకున్నా ఆ చెట్లు నవ్వుతాయట..! అవును మీరు చదివేది నిజమే. గుడ్‌గుడి అనే పేరుగల చెట్లు ముట్టుకుంటే నవ్వుతాయి. నవ్వే లక్షణాన్ని బట్టే ఈ చెట్లను లాఫింగ్ ట్రీస్ అంటారు.

Laughing trees : ముట్టుకుంటే చాలు నవ్వే చెట్లను మీరు ఎప్పుడైనా చూశారా..? మనం ముట్టుకున్నా, చెక్కిలిగింతలు పెట్టినా, కౌగిలించుకున్నా ఆ చెట్లు నవ్వుతాయట..! అవును మీరు చదివేది నిజమే. గుడ్‌గుడి అనే పేరుగల చెట్లు ముట్టుకుంటే నవ్వుతాయి. నవ్వే లక్షణాన్ని బట్టే ఈ చెట్లను లాఫింగ్ ట్రీస్ అంటారు. ఈ చెట్లు మనిషి స్పర్శ తగలగానే నవ్వుతాయి. నవ్వడం అంటే మనలా పగలబడి నవ్వదు. మనం చెట్టు మొదలుపై చేయి వేయగానే ఎలాంటి గాలి లేకపోయినా కొమ్మలు గాలిదుమారం వచ్చినట్టుగా ఊగుతాయి. మనం చేయి తీయగానే ఆగిపోతాయి.
ఈ విచిత్రమైన గుడ్‌గుడి చెట్లు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కలదుంగి అడవిలో కూడా రెండు ఉన్నాయి. ఈ చెట్లలోని అసాధారణ లక్షణం పరిశోధకలను, పర్యాటకులను తెగ ఆకర్షిస్తున్నది. ఈ చెట్ల శాస్త్రీయ నామం రాండియా డ్యుమటోరమ్ అని నైనిటాల్‌లోని కుమావూన్ యూనివర్సిటీ వృక్షశాస్త్ర ప్రొఫెసర్ చెప్పారు. సాధారణంగా ఈ రకం చెట్లు 300 నుంచి 1300 మీటర్ల వరకు ఎత్తయిన ప్రదేశాల్లో కనిపిస్తాయని ఆయన తెలిపారు.
కార్బెట్ విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ.. పర్యాటకుల కోసం రెండు లాఫింగ్ ట్రీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఈ చెట్ల గురించి పర్యాటకులకు వివరించడానికి ప్రత్యేకంగా గైడ్‌లను కూడా నియమించారు. ఈ గైడ్స్ ఇప్పటికీ తమ దగ్గరికి వచ్చే పర్యాటకులను అడవిలోపలికి తీసుకెళ్లి లాఫింగ్ ట్రీస్‌ను చూపిస్తుంటారు. మరి ఈ లాఫింగ్ ట్రీస్ ఎలా నవ్వుతాయో కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.