Man Lioness Epic Meet | సుస్సు పోసుకుందామని వెళ్లిన వ్యక్తి.. పక్కనే సింహం! భయపడిందెవరో తెలుసా?

Man Lioness Epic Meet | గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాలు, నగరాల శివారు ప్రాంతాల్లో అడవి మృగాలు తరచూ మనుషులకు తారసపడుతుంటాయి. ఆ సమయంలో కొన్ని భయపెడితే.. కొన్ని సరదా కలిగిస్తాయి. అటువంటి ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తున్నది. దానికి నెటిజన్లు పెట్టిన స్పందనలు, రాసిన కామెంట్లు.. మరింత ఆసక్తిదాయకంగా మార్చాయి.

Man Lioness Epic Meet | సుస్సు పోసుకుందామని వెళ్లిన వ్యక్తి.. పక్కనే సింహం! భయపడిందెవరో తెలుసా?

Man Lioness Epic Meet | గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాలు, నగరాల శివారు ప్రాంతాల్లో అడవి మృగాలు తరచూ మనుషులకు తారసపడుతుంటాయి. ఆ సమయంలో కొన్ని భయపెడితే.. కొన్ని సరదా కలిగిస్తాయి. అటువంటి ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తున్నది. దానికి నెటిజన్లు పెట్టిన స్పందనలు, రాసిన కామెంట్లు.. మరింత ఆసక్తిదాయకంగా మార్చాయి. ఈ దృశ్యం ఆ ఇంటికి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి ఇంటి పెరటిలోకి నడుచుకుంటూ వస్తుంటాడు. బహుశా మూత్ర విసర్జనకు అన్నట్టు అనిపిస్తున్నది. అదే సమయంలో అటువైపు నుంచి ఒక ఆడ సింహం నడుచుకుంటూ వస్తుంది. ఈ వ్యక్తికి మధ్యలో గోడ ఉండటం కారణంగా ఆ సింహం కనిపించలేదు. ఇక గోడ చాటుకు వెళుతూ చూస్తే.. ఎదురుగా సింహం!

ఆ సమయంలో సహజంగానే మనుషులు భయపడతారు. కళ్ల ముందు అంత పెద్ద సింహం ఉంటే ఎవరికి భయమేయదు? ఇతను కూడా భయపడ్డాడు. గబుక్కున వెనక్కు తిరిగి పరుగో పరుగు! విచిత్రం ఏమిటంటే.. చీకట్లో చూసి ఏమనుకున్నదో ఏమోగానీ.. ఆ సింహం కూడా ఆ మనిషి భయపడటాన్ని చూసి.. తాను సైతం భయపడిపోయి.. ఒక్క ఉదుటన వెనక్కు పరుగు తీసింది. చిన్న వీడియోనే అయినప్పటికీ.. అనేక మంది సరదా వ్యాఖ్యలతో స్పందించారు. ఒకరైతే మనిషిని ఉద్దేశించి రాశారో లేక సింహాన్ని ఉద్దేశించి రాశారోగానీ.. ‘మౌత్‌ సే భాగ్‌ కే ఆయా హూ’ అని కామెంటారు. ఆ మనిషి కంటే సింహమే ఎక్కువ భయపడినట్టుంది.. అని మరొకరు రెస్పాండ్‌ అయ్యారు. ఈ వీడియోలో అసలు అంశం.. సింహం భయపడటమేనని మరో నెటిజన్‌ రాశాడు. ‘భయంతో సింహం పరుగు తీసింది. వాడికి జీవితంలో ఇటువంటి ఘటన ఎదురై ఉండదు’ అని ఒకరు పేర్కొన్నారు. ‘అడవి సింహం ఎంత శక్తిమంతమైనదైనా.. అత్యంత తెలివైన మనిషిని చూస్తే.. ‘డర్‌ సబ్‌ కో లగ్‌తా హై’ అని మరో వ్యక్తి రాశాడు.

ఇదిలా ఉంటే.. రాజస్థాన్‌కు చెందిన మహిళ ఒక చిరుతపులికి రాఖీ కట్టిన వీడియో వైరల్‌గా మారింది. వన్య మృగాలను కాపాడాలన్న సందేశం ఇచ్చేందుకే తాను ఈ పని చేశానని ఆమె చెబుతున్నది. ఆమె చర్యను నెటిజన్లు ప్రశంసించారు. కొంత మంది ఆ చిరుతపులి బాగా బలహీనంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి.. 

టెలికాం భద్రతలో విప్లవం – పోగొట్టుకున్న 5.35 లక్షల ఫోన్ల రికవరీ
Andhra Pradesh | కింగ్ కోబ్రా అభయారణ్యం..ఏపీలోనే !
Padmanabhaswamy Temple | పద్మనాభ స్వామి ఆరో నేలమాళిగను తెరుస్తారా!
డైనోసార్ ను తలపించే భారీ మొసలి..చూస్తే గుండె జల్లె…!