మూడోకన్నుకు… 182 వసంతాలు

విధాత:1839వ సంవత్సరంలో ఫొటోగ్రఫీ ఆవిష్కరణ జరిగిన తరువాత క్రమంగా ప్రపంచ దేశాలు అన్నిటిలోకి ఈ ప్రక్రియ వ్యాపించటం మొద లైంది. ఈ క్రమంలో మన దేశంలోకి కూడా ఫొటోగ్రఫీ ప్రవేశించింది. ఆధారాలని బట్టి సుమారు 1840లోనే మనదేశంలోకి ప్రవేశించినట్లు దాఖలాలు ఉన్నాయి. ఆరోజుల్లో మొట్ట మొదటి వ్యాపారసంస్థను ఎఫ్‌. స్వ్రాన్‌హోపర్‌ అనే కమర్షియల్‌ ఫొటోగ్రాఫరు కలకత్తాలో కేలోటైపు ఫొటోగ్రఫీ ప్రక్రియతో ఒక స్టూడియోను ప్రారంభించినట్లుగా ఋజువులున్నాయి. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో. యజమాన్యాలు ఎన్నిమారినా ఆ స్టూడియో […]

మూడోకన్నుకు… 182 వసంతాలు

విధాత:1839వ సంవత్సరంలో ఫొటోగ్రఫీ ఆవిష్కరణ జరిగిన తరువాత క్రమంగా ప్రపంచ దేశాలు అన్నిటిలోకి ఈ ప్రక్రియ వ్యాపించటం మొద లైంది. ఈ క్రమంలో మన దేశంలోకి కూడా ఫొటోగ్రఫీ ప్రవేశించింది. ఆధారాలని బట్టి సుమారు 1840లోనే మనదేశంలోకి ప్రవేశించినట్లు దాఖలాలు ఉన్నాయి. ఆరోజుల్లో మొట్ట మొదటి వ్యాపారసంస్థను ఎఫ్‌. స్వ్రాన్‌హోపర్‌ అనే కమర్షియల్‌ ఫొటోగ్రాఫరు కలకత్తాలో కేలోటైపు ఫొటోగ్రఫీ ప్రక్రియతో ఒక స్టూడియోను ప్రారంభించినట్లుగా ఋజువులున్నాయి. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో.

యజమాన్యాలు ఎన్నిమారినా ఆ స్టూడియో ఇప్పటికి 8 చౌరంగీరోడ్డు కలకత్తాలో నిల్చిఉన్నది. ఆ రోజుల్లోనే 1853లో రాయల్‌ ఫొటో గ్రాఫిక్‌ సొసైటీని ఇంగ్లాండులో స్థాపించారు. 1854లో ఫొటో గ్రాఫిక్‌ సొసైటీ ఆఫ్‌ బాంబే స్థాపించబడింది. మనదేశంలో ఇది మొట్టమొదటి ఫొటోక్లబ్బు. ఆ తర్వాత ఇది ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్‌ ఇండియాగా మార్పు చెందింది. ఇది ఇప్పటికీ ఫొటోగ్రఫీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. 1855లో ఈ క్లబ్బు మొట్టమొదట ఫొటో ప్రదర్శనని ఏర్పాటు చేసింది.