Honor 6 Pro | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ హానర్ ఇటీవల ప్రీమియం 5జీ మొబైల్లో హానర్ మ్యాజిక్ 6ప్రో మోడల్ని ఇటీవల చేయాలో విడుదల చేసింది. తాజాగా ఈ మొబైల్‌ని భారత్‌లోకి విడుదల చేయబోతుందని సమాచారం. జూలై నెలలో భారత్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని పలు నివేదికలు తెలిపారు.
Honor Magic 6 Pro | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ హానర్ ఇటీవల ప్రీమియం 5జీ మొబైల్లో హానర్ మ్యాజిక్ 6ప్రో మోడల్ని ఇటీవల చేయాలో విడుదల చేసింది. తాజాగా ఈ మొబైల్‌ని భారత్‌లోకి విడుదల చేయబోతుందని సమాచారం. జూలై నెలలో భారత్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని పలు నివేదికలు తెలిపారు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ చైనాలో విడుదల కావడంతో ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ నివేదికను బయటపెట్టాయి. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పాటు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5600 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభించనున్నది.
12 జీబీ ర్యామ్‌తో పాటు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్.. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్, టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నట్లు టాక్. అయితే, సిరీస్‌కు సంబంధించి ధర తెలియరాలేదు. హైఎండ్ మోడల్ రూ.1.16లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇక స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, నానో క్రిస్టల్ షీల్డ్‌తో కూడిన డిస్ప్లే సెటప్ ఉంటుంది. 2800 x 1280 పిక్సల్స్ రిజల్యూషన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది.
మ్యాజిక్ ఓఎస్ 8 ఆధారిత ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. రియర్‌లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 180 మెగా పిక్సెల్ టెలీ ఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సల్స్ కెమెరా ఇచ్చింది. అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ నెట్ వర్క్ సపోర్ట్‌తో వస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్.. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5600 ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. బ్లాక్, గ్రీన్, బ్లూ, పర్పుల్, వైట్ కలర్స్‌లో వస్తాయి.