హైవైపై బీర్లు తాగుతూ యువజంట హల్‌చల్‌

సభ్యత మరిచి హైవేపై బహిరంగ ప్రదేశంలో బీర్లు, సిగరేట్ తాగుతూ తప్పు చేయడంతో పాటు ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌ను ఓ యువ జంట దుర్భాషలాడిన వైనం యువతరం విచ్చలవిడి పద్దతులకు నిదర్శనంగా నిలిచింది

హైవైపై బీర్లు తాగుతూ యువజంట హల్‌చల్‌

విధాత: సభ్యత మరిచి హైవేపై బహిరంగ ప్రదేశంలో బీర్లు, సిగరేట్ తాగుతూ తప్పు చేయడంతో పాటు ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌ను ఓ యువ జంట దుర్భాషలాడిన వైనం యువతరం విచ్చలవిడి పద్దతులకు నిదర్శనంగా నిలిచింది.

హైదరాబాద్-నాగోల్ రహదారిలో ఫతుల్లాగూడ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పిన వాకర్స్‌తో ఆ జంట గొడవకు దిగారు. గొడవ ఎక్కువ కావడంతో అక్కడి నుంచి ఉడాయించారు.