వరంగల్ జిల్లాలో ఏసీబీ దాడులు

- వ్యవసాయాధికారి వీరునాయక్ ఇంట్లో సోదాలు
- పలు పత్రాలు స్వాధీనం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయ అధికారి వీరునాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. హన్మకొండ హంటర్ రోడ్ న్యూ శాయంపేటలోని ఆయన ఇంట్లో ఈ సోదాలు సాగుతున్నాయి. గూడూరు మండలంలోని ఆయన భార్య కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాధ బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు.
ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రస్తుతం వీరునాయక్ కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ శాఖలో డీడీ ఎఫ్టీసీగా విధుల్లో ఉన్నారు. గతంలో జనగామలో పనిచేసినపుడు ఆయనపైన ఫిర్యాదు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.