పాలమూరు బీఆరెస్‌లో చేరికలు

పాలమూరు బీఆరెస్‌లో చేరికలు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు నియోజకవర్గంలో నెల రోజుల నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు మండలాలు, పాలమూరు పట్టణం ఉండడంతో ఈ ప్రాంతాలను మంత్రి ఇప్పటికే ఒకసారి ప్రచారం పూర్తి చేశారు.


ఈ నియోజకవర్గం తక్కువ పరిధి ఉండడంతో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ, ప్రజల మధ్యనే ఉంటూ అందరి కంటే ముందుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరే విధంగా మంత్రి పావులు కదుపుతున్నారు. ఇదివరకే అన్ని కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం పేరిట కార్యక్రమం పూర్తి చేశారు.


ఆదివారం పాలమూరు పట్టణంలోని వీరన్న పేట, బండమీది పల్లి ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్బంగా బీజేపీ నుంచి సుమారు వంద మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షతులై ఇతర పార్టీల నాయకులు బీఆరెస్ లో చేరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.