తెలంగాణకు వ‌ర్ష‌సూచ‌న

విధాత,హైదరాబాద్‌ : తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌టక నుంచి దక్షిణ ఇంటీ‌రి‌యర్‌ తమి‌ళ‌నాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌ దాకా ఉత్తర, దక్షిణ ఉప‌రి‌తల ద్రోణి ఏర్పడింది. సోమ‌వారం 1.5 కిలో‌మీ‌టర్ల వద్ద ఏర్పడిన మరో ఉప‌రి‌తల ద్రోణి బల‌హీన పడింది. వీటి ప్రభా‌వంతో రాష్ట్రంలో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని […]

తెలంగాణకు వ‌ర్ష‌సూచ‌న

విధాత,హైదరాబాద్‌ : తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌టక నుంచి దక్షిణ ఇంటీ‌రి‌యర్‌ తమి‌ళ‌నాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌ దాకా ఉత్తర, దక్షిణ ఉప‌రి‌తల ద్రోణి ఏర్పడింది. సోమ‌వారం 1.5 కిలో‌మీ‌టర్ల వద్ద ఏర్పడిన మరో ఉప‌రి‌తల ద్రోణి బల‌హీన పడింది. వీటి ప్రభా‌వంతో రాష్ట్రంలో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని వాతావరణ శాఖ వివరించింది. గడి‌చిన 24 గంటల్లో పలు‌చోట్ల వర్షం పడగా.. ఆదిలాబాద్‌, కొమురం భీమ్ ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట, నల్లగొండలో మోస్తరు వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులుపడ్డాయి.