భువనగిరి ఎంపీపీపై అవిశ్వాసానికి ఎంపీటీసీల నోటీసు

భువనగిరి ఎంపీపీపై అవిశ్వాసానికి ఎంపీటీసీల నోటీసు

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: భువనగిరి ఎంపీపీ నరాల నిర్మలపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని శనివారం ఎంపీటీసీలు ఆర్డీఓకు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ ఎంపీటీసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎంపీపీ నరాల నిర్మల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మండల పరిషత్ తీర్మానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు చేయకుండా వ్యవహరిస్తున్నందున భువనగిరి మండలంలోని ఎంపీటీసీలు అందరూ సమావేశమై ఆమెపై అవిశ్వాసం పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఏనుగు సంజీవరెడ్డి, ఉడుత శారద, కంచి లలిత, గోనుగుంట్ల కబ్బన, బొక్క కొందల్ రెడ్డి, రాసాల మల్లేష్, సామల వెంకటేష్, గడ్డమీద చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

– మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సావిత్రిపై..

 మోత్కూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రిపై శనివారం కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మాన పత్రాలను కలెక్టర్‌ హనుమంతుకు అందజేశారు. తీర్మాన పత్రంపై ఐదుగురు బీఆర్ఎస్, నలుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సంతకాలు చేశారు.