Nalgonda: MLA లింగయ్య పై పోలీసులకు BJP ఫిర్యాదు.. దిష్టిబొమ్మ దహనం
విధాత: ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)పై బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(ML Chirumarti Lingayya) బండి సంజయ్ భార్య, బీజేపీ నాయకుల భార్యలను ఉద్దేశించి వారికి తెలంగాణ తమ్ముళ్లు, బిఆర్ఎస్(BRS) నాయకులు ముద్దులు పెడతారు ఊరుకుంటారా అంటూ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మండిపడిన బిజెపి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిరసనలకు దిగారు. బీజేపీ మహిళలను అవమానిస్తూ, బండి సంజయ్‌ని చెప్పుతో కొడతాము దొంగ నా కొడకా అంటూ లింగయ్య […]

విధాత: ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)పై బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(ML Chirumarti Lingayya) బండి సంజయ్ భార్య, బీజేపీ నాయకుల భార్యలను ఉద్దేశించి వారికి తెలంగాణ తమ్ముళ్లు, బిఆర్ఎస్(BRS) నాయకులు ముద్దులు పెడతారు ఊరుకుంటారా అంటూ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మండిపడిన బిజెపి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిరసనలకు దిగారు. బీజేపీ మహిళలను అవమానిస్తూ, బండి సంజయ్‌ని చెప్పుతో కొడతాము దొంగ నా కొడకా అంటూ లింగయ్య దుర్భాషలాడటం పట్ల బిజెపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్గొండ గడియారం సెంటర్లో, మండల కేంద్రాల్లో చిరుమర్తి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. లింగయ్య వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతేపాక సాంబయ్య మాట్లాడుతూ చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయన్నారు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఉన్న లింగయ్య మహిళలను దుర్భాషలాడుతూ అవమానించే రీతిలో మాట్లాడటం అభ్యంతరకరమన్నారు. లింగయ్య పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర మహిళా కమిషన్, పోలీస్ శాఖలు లింగయ్య వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ వైఖరి చూస్తే కేసీఆర్ కుటుంబం మహిళలకే పరిమితమైనట్లుగా వ్యవహరిస్తుందని రాష్ట్రంలో గవర్నర్ పట్ల, షర్మిల పట్ల బిఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై గాని, రాష్ట్రంలో మహిళలు, మైనర్లపై జరిగిన అత్యాచారాలపై గాని, మెడికల్ విద్యార్థి ప్రీతి మృతి ఘటనపై గాని స్పందించని మహిళా కమిషన్ బండి సంజయ్ వ్యాఖ్యలపై మాత్రం సుమోటో కేసుతో స్పందించడం విడ్డురంగా ఉందన్నారు. మహిళలను అవమానించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకుని మహిళా కమిషన్ తన నిబద్ధతను నిరూపించుకోవాలని సాంబయ్య డిమాండ్ చేశారు.