MLA Arekapudi Gandhi | కాంగ్రెస్‌లో చేరిన బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ

శేరిలింగంపల్లి బీఆరెస్‌ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సీఎంరేవంత్‌రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని నివాసంలో కలిశారు

MLA Arekapudi Gandhi | కాంగ్రెస్‌లో చేరిన బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ

విధాత, హైదరాబాద్ : శేరిలింగంపల్లి బీఆరెస్‌ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సీఎంరేవంత్‌రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని నివాసంలో కలిశారు. అరికపూడి గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పోరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

గాంధీ చేరికతో ఇప్పటిదాకా బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు నేడో రేపో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ నెల 24వ తేదీ అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆరెస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కావచ్చని తెలుస్తుంది. అసెంబ్లీలో బీఆరెస్‌కు 38మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉండగా..అందులో నుంచి ఇప్పటికే 9మంది కాంగ్రెస్‌లో చేరిపోయారు. 26మంది చేరితే బీఆరెస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కానుంది.