BRS | కాళేశ్వరం పర్యటనకు బయలుదేరిన బీఆరెస్ బృందం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలు దేరింది

BRS | కాళేశ్వరం పర్యటనకు బయలుదేరిన బీఆరెస్ బృందం

లోయర్ మానేరు డ్యాం పరిశీలన

విధాత : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలు దేరింది. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం పూర్తికాగానే బీఆరెస్ బృందం కరీంనగర్ లోని లోయరు మానేరు డ్యామ్‌ను సందర్శనకు వెళ్లింది. అక్కడ 6గంటలకు కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతారు.

గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు, కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆరెస్ బృందం మేడిగడ్డ బాట పట్టింది. శుక్రవారం కన్నెపల్లి పంప్‌హౌస్‌, మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించనున్నది. ఈరోజు శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగం ముగిశాక అక్కడి నుంచే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డకు బయలుదేరనున్నది.