KTR | కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలిక ఊడినట్టుంది: కేటీఆర్
పక్షపాతానికి గురైన ఒంటరి వృద్దురాలు దాసరి మల్లమ్మ 1లక్ష 72వేల పెన్షన్ డబ్బులు వెనక్కి కట్టాలంటూ ప్రభుత్వం నోటీసులివ్వడంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీటర్ వేదికగా మండిపడ్డారు

విధాత, హైదరాబాద్: పక్షపాతానికి గురైన ఒంటరి వృద్దురాలు దాసరి మల్లమ్మ 1లక్ష 72వేల పెన్షన్ డబ్బులు వెనక్కి కట్టాలంటూ ప్రభుత్వం నోటీసులివ్వడంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీటర్ వేదికగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుందని విమర్శించారు.
కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని దుయ్యబట్టారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోందన్నారు.
కొండ నాలుకకు మందేస్తే
ఉన్న నాలిక ఊడినట్టుంది!కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది.
ఏవో సాంకేతిక… pic.twitter.com/tQadMKcvuz
— KTR (@KTRBRS) July 13, 2024
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారని, ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారన్నారు