రాజాసింగ్‌, కడియం, పల్లాలపై కాంగ్రెస్ ఫిర్యాదు

బీజేపీ, బీఆరెస్ పార్టీల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు కాంగ్రెస్ నేతలు మంగళవారం ఫిర్యాదు చేశారు

రాజాసింగ్‌, కడియం, పల్లాలపై కాంగ్రెస్ ఫిర్యాదు

విధాత : బీజేపీ, బీఆరెస్ పార్టీల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు కాంగ్రెస్ నేతలు మంగళవారం ఫిర్యాదు చేశారు. పీసీసీ జనరల్ సెక్రెటరీలు కైలాష్ నేత, చారుకొండ వెంకటేష్, మధుసూదన్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును డీజీపీకి ఇచ్చారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆరెస్‌ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖల్యపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కోన్నారు.


ఫిర్యాదు అనంతరం అనంతరం కాంగ్రెస్ నేతలు విలేఖరులతో మాట్లాడుతూ తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలకు బీజేపీ, బీఆరెస్ ఎమ్మెల్యేలు తెరలేపారని, అందుకే వారు ముగ్గురు కూడా ఒకే రకమైన స్టేట్‌మెంట్ ఇచ్చారని ఆరోపించారు. మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కులగొట్టే కుట్ర చేస్తున్నారని, అందుకే బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశామని వెల్లడించారు. బీజేపీ, బీఆరెస్‌ల ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీని కోరడం జరిగిందని తెలిపారు.