ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ధి రాలేదు…మాజీ మంత్రి…ఇక మారవా?

పాలమూరు ప్రజలు ఛీ కొట్టినా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరులో మార్పు రాలేదని, అధికారం పోయినా అహంకారం ఇంకా పోలేదని జిల్లా కాంగ్రెస్ నేతలు నిప్పులు చేరిగారు.

ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ధి రాలేదు…మాజీ మంత్రి…ఇక మారవా?
  • యూరియా పై శ్రీనివాస్ గౌడ్ డ్రామా
  • ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ధి రాలేదు
  • మాజీ మంత్రి పై కాంగ్రెస్ నేతల ఫైర్

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : పాలమూరు ప్రజలు ఛీ కొట్టినా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరులో మార్పు రాలేదని, అధికారం పోయినా అహంకారం ఇంకా పోలేదని జిల్లా కాంగ్రెస్ నేతలు నిప్పులు చేరిగారు. శనివారం డీసీసీ కార్యాలయం లో సీనియర్ కాంగ్రెస్ నేతలు సురేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నర్సింహా రెడ్డి మాజీ మంత్రి తీరు పై మండిపడ్డారు.  యూరియా పంపిణి విషయం లో అన్ని డ్రామా లు ఆడుతూ కాంగ్రెస్ పార్టీ పై విషం చిమ్ముతున్నారన్నారు. రైతులపై కపట ప్రేమ చూపిస్తూ కాలం గడుపుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ‘జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర యూరియా విక్రయ కేంద్రం దగ్గరికి వచ్చిన రిక్షా నడిపే ఆంజనేయులుకు మూర్చ రావడంతో అక్కడే కొంతమంది చుట్టుపక్కల వారు అక్కడే పడుకోబెట్టారు.

ఈ తరుణంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చి యూరియా కోసం రైతు పడిగాపులు కాస్తు పడిపోయారని అబద్దం చెప్పి , వెంటనే అంబులెన్స్ పిలిపించి ఆంజనేయులు ను ఆసుపత్రికి పంపించి పెద్ద డ్రామా కు తెరలేపారు’ అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. శ్రీనివాస్ గౌడ్ ఆనవాళ్లు లేకుండా తుడిచి పెట్టుకుపోయే రోజులు వచ్చేశాయని, త్వరలో ఆయన చేసిన మోసలను పూర్తిస్థాయిలో బహిర్గతం చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. బీజేపీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరాజ్ ఖాద్రీ, ప్రచార కార్యదర్శి బెనహర్ తదితరులు ఉన్నారు.