CPM, CPIలు TRSతో పొత్తు సిగ్గుచేటు: MCPIU

మోడీ, కేసీఆర్‌వి ప్రజావ్యతిరేక విధానాలు వర్గ, సామాజిక పోరాటాలే ప్రత్యామ్నాయం ఎంసీపిఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బూర్జువా, భూస్వామ్య, పెట్టుబడిదారీ మతోన్మాద విధానాలతో పెరిగిపోతున్న అసమానతలకు వర్గ, సామాజిక ఐక్య పోరాటాలే ఏకైక ప్రత్యామ్నాయమని భారత మార్క్సి స్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య) ఎంసిపిఐ(యు)రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. వామపక్ష సామాజిక కమ్యూనిస్టుల ఐక్యతకు పూనుకోవాల్సిన సిపిఎం, సిపిఐ పార్టీలు బిఆర్ఎస్ కేసిఆర్ తో జట్టు కట్టి ఎర్రజెండాకు తలవంపులు […]

CPM, CPIలు TRSతో పొత్తు సిగ్గుచేటు: MCPIU
  • మోడీ, కేసీఆర్‌వి ప్రజావ్యతిరేక విధానాలు
  • వర్గ, సామాజిక పోరాటాలే ప్రత్యామ్నాయం
  • ఎంసీపిఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బూర్జువా, భూస్వామ్య, పెట్టుబడిదారీ మతోన్మాద విధానాలతో పెరిగిపోతున్న అసమానతలకు వర్గ, సామాజిక ఐక్య పోరాటాలే ఏకైక ప్రత్యామ్నాయమని భారత మార్క్సి స్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య) ఎంసిపిఐ(యు)రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు.

వామపక్ష సామాజిక కమ్యూనిస్టుల ఐక్యతకు పూనుకోవాల్సిన సిపిఎం, సిపిఐ పార్టీలు బిఆర్ఎస్ కేసిఆర్ తో జట్టు కట్టి ఎర్రజెండాకు తలవంపులు తెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఎంసీపి ఐ(యు) హన్మకొండ జిల్లా ప్లీనరీ సమావేశం పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్‌లో కామ్రేడ్ మాస్ సావిత్రి, తక్కల్లపెళ్లి బాబురావు అధ్యక్ష వర్గంగా ప్రారంభం అయ్యాయి.

స‌మావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గాధగోని రవి మాట్లాడారు. ఎన్నో ఆశలు, ఆశయాలు ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నియంతృత్వ విధానాలతో, దేశంలో మోడీ మతోన్మాద విధానాలతో పాలన సాగిస్తూ పేద మధ్యతరగతి ప్రజానీకం పై ఎనలేని భారాలు మోపుతున్నారని విమర్శించారు.

ఈ క్రమంలో కార్పొరేట్ శక్తులకు రాయితీలు కల్పిస్తూ సంపదను దోచిపెడుతూ, ఓట్లు సీట్లు అధికారం లక్ష్యంగా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తూ రాజకీయ పబ్బాన్ని గడుపుతున్నారని మండిప‌డ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కొత్త హామీలను ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితులలో ప్రజలకు అండగా నిలవాల్సిన సిపిఎం, సిపిఐ పార్టీలు అది విస్మరించి మతోన్మాద వ్యతిరేకమంటూ అధికార టిఆర్ఎస్ తో జట్టు కట్టడం సరైనది కాదు అని అన్నారు. అందుకు వర్గ పోరాటాలను సామాజిక ఉద్యమాలను జమిలి గా నడుపుటకు సిద్ధం కావాలని ప్రజల్లో చైతన్యాన్ని నింపాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు వల్లపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పసుపుల మట్టయ్య, వనం సుధాకర్, కుమ్మం సుకన్య, పెద్దారపు రమేష్, హేన్ రెడ్డి హంసారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కర్ర రాజిరెడ్డి, గడ్డం నాగార్జున, నీల రవీందర్, పరికిరాల భూమయ్య, జిల్లా కమిటీ సభ్యులు కూసం బుచ్చయ్య, మంద భద్రయ్య, మహ్మద్ ఉస్మాను, బండారి చిరంజీవి, శ్రీనివాసరావు, ఇంద్రారెడ్డి, ప్రభాకర్ రావు, రాజేశ్వరరావు, సుధాకర్, ఇంద్ర, సబిత, మొగిలి దాదాపు 150 మంది ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.