రాష్ట్రంలో బీఆరెస్ అడ్ర‌స్ గ‌ల్లంతు: డిప్యూటీ సీఎం భ‌ట్టి

రాష్ట్రంలో బీఆరెస్ అడ్రస్ గల్లంతు అయింద‌ని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్క‌మార్క అన్నారు. సోమ‌వారం మ‌ధిర నియోజ‌క వ‌ర్గంలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న మాట్లాడుతూ బీఆరెస్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు

రాష్ట్రంలో బీఆరెస్ అడ్ర‌స్ గ‌ల్లంతు: డిప్యూటీ సీఎం భ‌ట్టి

ఒక్క సీటు గెలిచే ప‌రిస్థితి లేదు
ఆ పార్టీ అభ్య‌ర్థి కేంద్ర మంత్రి ఎలా అవుతాడు
కాంగ్రెస్‌, క‌మ్యూనిస్ట్‌లు క‌లిశారు
ఖ‌మ్మం జిల్లాలో మ‌రో పార్టీకి స్థానంలేదు
డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

విధాత‌: రాష్ట్రంలో బీఆరెస్ అడ్రస్ గల్లంతు అయింద‌ని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్క‌మార్క అన్నారు. సోమ‌వారం మ‌ధిర నియోజ‌క వ‌ర్గంలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న మాట్లాడుతూ బీఆరెస్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. అలాంటి పార్టీ అభ్యర్థి కేంద్ర మంత్రి ఎలా అవుతాడని ప్ర‌శ్నించారు. ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్, క‌మ్యూనిస్టులు క‌లిశార‌ని, ఇక్క‌డ మ‌రో పార్టీ అభ్య‌ర్థికి స్థానం లేద‌ని అన్నారు.

రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో అంచనాలను రూ. 25 వేల కోట్లకు పెంచి ఖమ్మం జిల్లాకు చుక్క నీరు ఇవ్వని దుర్మార్గులు బి ఆర్ ఎస్ నేతలన్నారు. గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా రైతుల కాళ్లు కడుగుతామ‌న్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన మీరు ఏనాడైనా మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేశారా? అని అడిగారు. అబద్దాల పునాదులపై పుట్టిన బీ ఆర్ఎస్ రైతుబంధుపై కాకిలా అరుస్తోందన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు చేస్తారన్నారు.