Deputy CM Bhatti | మొలకెత్తిన ధాన్యాన్నీ మద్దతు ధరకే కొంటాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొంటామని రైతులు ఆందోళన చెందవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

Deputy CM Bhatti | మొలకెత్తిన ధాన్యాన్నీ మద్దతు ధరకే కొంటాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విధాత: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొంటామని రైతులు ఆందోళన చెందవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రూ. 500 బోనస్‌ సన్న ధాన్యానికే అని విపక్షాలు చేస్తున్న విమర్శలను భట్టి తిప్పికొట్టారు. రూ. 500 బోనస్‌ సన్నధాన్యం నుంచే ప్రారంభిస్తున్నామని పునరుద్ఘాటించారు. గతంలో ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వపై దుష్ప్రచారం చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టవద్దని విక్కమార్క విపక్ష నేతలకు సూచించారు.

తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటామన్నారు. చివరికి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ఒక్క గింజ వదిలిపెట్టకుండా ఈ ప్రభుత్వం కొంటుందని చాలా స్పష్టంగా చెప్పామన్నారు. రైతులకు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాం. గత ప్రభుత్వం హయాంలో నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవారు కాదని విమర్శించారు. అలాంటి ఇబ్బందులేవీ ఇప్పుడు లేవని, రైతులకు మూడు రోజుల్లో డబ్బుల చెల్లిస్తున్నామని ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.