పదవి లేకున్నా పదేళ్లుగా ప్రజల వెంటే
ఏ పదవీ లేకున్నా పదేళ్లుగా కాంగ్రెస్ జెండాను మోస్తూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలపక్షాన నిలిచిన మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ సాగర రావును గెలిపించాలని ఆయన తనయుడు చరణ్ రావు పిలుపునిచ్చారు.

- మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ సాగర రావును గెలిపించండి
- తనయుడు చరణ్ రావు పిలుపు
- మంచిర్యాలలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఏ పదవీ లేకున్నా పదేళ్లుగా కాంగ్రెస్ జెండాను మోస్తూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలపక్షాన నిలిచిన మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ సాగర రావును గెలిపించాలని ఆయన తనయుడు చరణ్ రావు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అభ్యర్థి, తన తండ్రి కొక్కిరాల ప్రేమ సాగర రావును గెలిపించాలని కోరుతూ సోమవారం తనయుడు చరణ్ రావు మంచిర్యాల పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుకాణాలకు వెళ్తూ దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలను వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి తన తండ్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పాలనతోనే మంచిర్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు.