దేశ వ్యాప్తంగా మోడీ సర్కారు కి వ్యతిరేకంగా ఈ నెల‌16 న‌ ఆందోళన లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి తెలిపారు

  • పాల్గొన‌నున్న మంత్రులు
  • పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి

విధాత‌: దేశ వ్యాప్తంగా మోడీ సర్కారు కి వ్యతిరేకంగా ఈ నెల‌16 న‌ ఆందోళన లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇందిరాపార్క్ వ‌ద్ద భారీ ఎత్తున ధ‌ర్నా చేస్తామ‌ని వెల్ల‌డించారు. మంత్రులు కూడా ఇందిరా పార్క్ కు వ‌చ్చి ధర్నాలో పాల్గొంటారన్నారు. సీపీఐ.. సీపీఎం.. జనసమితి పార్టీ అందరిని కలుపుకుని పోతామ‌న్నారు. నిరస‌న ధ‌ర్నా స‌క్సెస్ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటద‌న్నారు. రైతులను కాపాడుకోవడానికి అందరం సిద్ధం అవ్వాలన్నారు. ధ‌ర్నాను విజ‌య‌వంతం చేయ‌డానికి అన్ని సంఘాల‌తో క‌మిటీ వేసుకోవాల‌న్నారు. పార్టీ త‌ర‌పున పీసీసీతో చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. రైతులను.. కార్మికులను హత్య చేసేలా న‌ల్ల‌చ‌ట్టాలు ఉన్నాయ‌న్నారు.

రైతుల‌ను మోసం చేసిన మోదీ: కోదండ‌రెడ్డి

నల్ల చట్టాలు తెచ్చి మోదీ రైతులను మోసం శాడ‌ని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్య‌క్షులు మాజీ ఎమ్మెల్యే కోదండ‌రెడ్డి అన్నారు. అప్ప‌ట్లో రైతులు ఆందోళ‌న చేస్తే చ‌ట్టాల‌ను వెన‌క్కు తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించిన మోదీ ఇప్ప‌టికి మూడు సార్లు పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రిగినా ఆ న‌ల్ల చ‌ట్టాల‌ను వెన‌క్కు తీసుకోలేద‌న్నారు. ఆదాని, అంబానీల‌కు లాభం చేసే పనిలో మోడీ ఉన్నారని విమ‌ర్శించారు. బడా బాబులకు లబ్ది చేకూర్చేలా మోడీ వ్యవహారం ఉందన్నారు.

న‌ల్ల‌చ‌ట్టాలు దొడ్డి దారిన అమ‌లు చేసే కుట్ర‌: అన్వేష్ రెడ్డి

నల్ల చట్టాలు దొడ్డి దారిన అమలు చేసే కుట్ర కేంద్రంలో జరుగుతుందని కిసాన్‌ కాంగ్రెస్ అధ్య‌క్షుడు అన్వేష్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బడా బాబులకు లబ్ది చేకూర్చే పనిలో బీజేపీ నేత‌లున్నార‌న్నారు. హైదరాబాద్ లో పెద్ద ర్యాలీ చేద్దామ‌న్నారు. గ్రామీణ రైతులకు కూడా అర్థం అయ్యేలా నిరసన ఉండాలని తెలిపారు.

Somu

Somu

Next Story