Medak | బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టాడని కొడుకుని చంపిన తండ్రి
బెట్టింగ్‌లకు అలవాటు పడి డబ్బులను పోగొడుతున్నాడన్న కోపంతో కన్న కొడుకునే ఓ తండ్రి దారుణంగా కొట్టి చంపిన దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది

మెదక్ జిల్లాలో దారుణం
విధాత : బెట్టింగ్‌లకు అలవాటు పడి డబ్బులను పోగొడుతున్నాడన్న కోపంతో కన్న కొడుకునే ఓ తండ్రి దారుణంగా కొట్టి చంపిన దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్న శంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన సత్యనారాయణ కొడుకు ముకేశ్ కుమార్ (28) రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ ముకేశ్ జల్సాలకు అలవాటు పడి, బెట్టింగ్‌లు ఆడుతూ ఉన్న డబ్బులను పోగొట్టాడు.
ఈ విషయం తెలిసి సత్యనారాయణ ఎన్నిసార్లు వారించినా ముకేశ్ వినిపించుకోలేదు, అప్పటికే ముకేశ్ 2 కోట్ల వరకూ బెట్టింగ్‌లో పోగొట్టాడు. ఎన్నిసార్లు చెప్పిన కొడుకు వినిపించుకోవడ లేదన్న ఆవేశంతో సత్యానారాయణ.. ఐరన్ రోడ్‌తో తలపై బలంగా ముకేశ్‌ను కొట్టడంతో అతను మృతి చెందాడు. ముకేశ్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మేడ్చల్లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్ కారణంగా అమ్మేశారని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.