తెలంగాణ ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం
విధాత: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చింది. ఇన్నాళ్లు ప్రయివేటు పాఠశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు పరుగెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే విద్యార్థుల పునరాగమనానికి నిదర్శనం. నాణ్యమైన, పటిష్టమైన విద్యను విద్యార్థులకు అందివ్వడంతో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. దీంతో ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లలను ప్రయివేటుకు కాకుండా సర్కార్ బడికి […]

విధాత: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చింది. ఇన్నాళ్లు ప్రయివేటు పాఠశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు పరుగెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే విద్యార్థుల పునరాగమనానికి నిదర్శనం. నాణ్యమైన, పటిష్టమైన విద్యను విద్యార్థులకు అందివ్వడంతో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. దీంతో ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లలను ప్రయివేటుకు కాకుండా సర్కార్ బడికి పంపేందుకు తల్లిదండ్రులు సైతం ఆసక్తి చూపుతున్నారు.
2021-22 విద్యాసంవత్సరంలో ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న 1.25 లక్షల మంది విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. దీంతో గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40 శాతం పెరిగింది.