పాడికి దక్కిన ఎమ్మెల్సీ పదవి
విధాత:పది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన హుజూరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డి గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం పూర్తి కాగా, ఈ స్థానానికి కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రస్థాయి గుర్తింపును […]

విధాత:పది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన హుజూరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డి గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం పూర్తి కాగా, ఈ స్థానానికి కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రస్థాయి గుర్తింపును ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఆయనకు అవకాశం వస్తుందని భావించగా, ఏకంగా మండలికి నామినేట్ కావడం టీఆర్‌ఎస్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.