సోనియాగాంధీకి ఆహ్వానంపై విమర్శలు మతిలేనివి: బీర్ల అయిలయ్య

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తల్లి సోనియా గాంధీ తప్పని సరిగా వస్తారని, దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఎలా ఆహ్వానిస్తారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మతి లేని మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదవ్ విమర్శించారు

సోనియాగాంధీకి ఆహ్వానంపై విమర్శలు మతిలేనివి: బీర్ల అయిలయ్య

విధాత, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తల్లి సోనియా గాంధీ తప్పని సరిగా వస్తారని, దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఎలా ఆహ్వానిస్తారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మతి లేని మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదవ్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన దేవత కాబట్టే మా సీఎం  రేవంత్ రెడ్డి  సోనియమ్మను ఆహ్వానించారని తెలిపారు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, జగదీష్ రెడ్డికి పదవులు  ఎలా వచ్చేవని ప్రశ్నించారు.

పదేళ్ల పాలనలో కేసీఆర్‌ తెలంగాణ ద్రోహులకు పెద్ద పీట వేశారని విమర్శించారు. రాష్ట్రం ఇచ్చినప్పుడు కేసీఆర్, ఆయన కుటుంబం సోనియమ్మ కాళ్ల దగ్గర మోకరిల్లి టీఆరెస్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్న సంగతి మరువరాదన్నారు. సోనియమ్మను విమర్శిస్తే బీఆరెస్‌ నేతలను తెలంగాణ ప్రజలు తరిమికొడతారన్నారు. జగదీష్ రెడ్డి మళ్లీ ఇలాంటి మాటల మాట్లాడితే ప్రజలు రాళ్లతో కొడతారన్నారు. కేసీఆర్ దగ్గర ఊడిగం చేయడం తప్ప జగదీష్  రెడ్డికి  ప్రజల మనోభావాలు తెలియవని మండిపడ్డారు.