CM Revanth Reddy | హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సమీక్షించారు

కొడంగల్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ పైలట్ ప్రాజెక్టుపై చర్చ
విధాత, హైదరాబాద్ : హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సమీక్షించారు. ఫౌండేషన్ ప్రతినిధులతో ఆయన సమీక్ష చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సెమి రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ముందుగా సీఎం సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిని హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ ఫండ్స్ తో నిర్వహించనున్నారు.
హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula సమీక్షించారు. కొడంగల్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ పైలట్… pic.twitter.com/fhuEAbhSB6
— Telangana CMO (@TelanganaCMO) July 28, 2024
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చ జరిపారు. ఈ ప్రాజెక్టు కింద సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతీరోజు 28 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు సాధ్యసాధ్యాలపై వారితో చర్చించారు. ఇందు కోసం కొడంగల్ పట్టణంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిసింది. సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది సక్సెస్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు దీనిపై పూర్తిగా అధ్యయనం చేయాలని సీఎం ట్రస్ట్ సభ్యులకు సూచించినట్లుగా సమాచారం.